సీనియర్ నటి రమాప్రభ తెలుగులోనే వందల సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అత్తగా, బామ్మగా నటించి మెప్పించింది. ఇప్పుడు వయసు రిత్యా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. తన మాజీ భర్త శరత్ బాబు చేసిన మోసాన్ని ఆమె బయటపెట్టింది.
రమా ప్రభ 1966 నుంచి నటిగా రాణిస్తుంది. స్టార్‌గా వెలుగొందుతుంది. నటిగా ఆమె వందల సినిమాల్లో నటించింది. ఆ సమయంలో నటుడు శరత్ బాబు తన జీవితంలోకి వచ్చాడు. ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. స్నేహం పెరిగింది. దీంతో శరత్ బాబుని తన జీవితంలోకి ఆహ్వానించిందట రమా ప్రభ. తాను స్టార్‌గా రాణిస్తున్న సమయంలో శరత్ బాబు అప్పుడప్పుడే నటుడిగా నిలదొక్కుంటున్నాడు.
దీనిపై రమా ప్రభ స్పందించింది. తమ పరిచయం యాక్సిడెంటల్‌గా పెళ్లి వరకు వెళ్లిందని తెలిపింది. డబ్బు కోసమే తాను పెళ్లి చేసుకున్నాడనే విషయాన్ని తాను చెప్పలేనుగానీ, అవకాశం కోసం మాత్రం వచ్చాడని తెలిపింది రమా ప్రభ. తన వద్ద ఉండి అవకాశాలను ఉపయోగించుకుని ఎదగాలని ప్రయత్నించాడని చెప్పింది. శరత్‌బాబుతో పదహారు సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్పిన ఆమె ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తి విరుద్ధమని చెప్పింది.
అన్నేళ్లు ఎలా ఉన్నామని అడిగితే, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామ్ కదా, రియల్ లైఫ్ కూడా యాక్ట్ చేశామని చెప్పింది. అయితే తాను జోవియల్ పర్సన్ అని, ఎవరైనా బాగా అనిపిస్తే ఓపెన్‌గా మాట్లాడటం తెలుసు. అంతేకాదు రాంగ్ ఆలోచనలు ఉండేవి కాదని, తనకు లవ్ మీద ఉన్నంత ఇష్టం, సెక్స్ మీద ఉండదని వెల్లడిచింది రమా ప్రభ. ఐదు నిమిషాల సెక్స్ కోసం ప్రేమ మిస్ అయిపోతుందని, తేడాలు వస్తాయని, ఆ విషయంలో డిస్టెన్స్ మెయింటేన్ చేసేదాన్ని అని వెల్లడించింది రమాప్రభ.
తమ మధ్య కొందరు చిచ్చుపెట్టారని, రమా ప్రభ ఆయన్ని చేసుకుందని చాలా మంది నటీనటులు ఈర్ష్యా చెందారని, అబ్బాయిలు తనమీద, అమ్మాయిలు శరత్‌బాబుపై ప్రేమని చూపించేవారని, ఈ క్రమంలో కొందరు తోటీ నటీమణులే కుట్రలు చేశారని, గొడవలకు కారణమయ్యారని తెలిపింది. అంతేకాదు తామిద్దరం విడిపోయే సమయంలో డబ్బు అంతా పోయిందని, అయితే అదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని, లోపల కుట్రలు చేశారని, ఆ విషయం తెలియక తాను ఆస్తులు రాసిచ్చేశారని, చాలా కోల్పోయినట్టు చెప్పింది రమా ప్రభ. ఆ తర్వాత వాళ్లు ఆ కుట్రల ఫలితాలను అనుభవించారని వెల్లడించింది.
sarath babu
అయితే డబ్బు కోసం కుట్రలు ఆయనే చేశాడా? లేదంటే ఎవరైనా చేయించారా? అనేది చెప్పనుగానీ, అలాంటిదే జరిగిందని, శరత్ బాబు తన ప్రయోజనాల కోసం నా ఫ్యామిలీని కూడా వాడుకున్నాడని, వాళ్లు చదువుకోలేదని, కానీ తన అక్క అనే తనపై ప్రేమతో అవన్నీ చేశారని, అలా మోసపోవాల్సి వచ్చిందని తెలిపింది రమా ప్రభ. `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` టాక్ షోలో ఆమె ఈ సంచలన విషయాలను వెల్లడించింది. శరత్‌బాబు గతేడాది మేలో కన్నుమూసిన విషయం తెలిసిందే.