DC Movie Review: డీసీ మూవీ రివ్యూ, లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా నటించిన మూవీ ఎలా ఉందంటే?

Published : Aug 07, 2026, 11:52 AM IST

DC Movie Review: దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా నటించిన చిత్రం `డీసీ`. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

PREV
16
డీసీ మూవీ రివ్యూ

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌. విజయ్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్‌`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇందులో వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. సన్‌ పిక్చర్స్ నిర్మించింది. నేడు శుక్రవారం(ఆగస్ట్ 7)న ఈ చిత్రం విడుదలైంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్‌ చేశారు. మరి సినిమా ఎలా ఉంది? లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మెప్పించాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
డీసీ మూవీ కథ

దేవదాస్‌(లోకేష్‌ కనగరాజ్‌) గ్యాంగ్‌స్టర్‌. సర్కార్‌ టీమ్‌లో పనిచేస్తుంటాడు. వీళ్లు పోలీస్‌ లపై దాడి చేసి కొత్తగా వచ్చిన తుపాకులను ఎత్తుకుపోతారు. పోలీస్‌లపై దాడి చేస్తారు. అదే సమయంలో కొడుకు చదువు కోసం భూమి అమ్మి ఏడు లక్షలు పోగు చేసి ఇంటికెళ్తున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేసి చంపేస్తారు. డబ్బులు దోచుకుంటారు. ఇది తెలిసి దేవదాస్‌ టీమ్‌ ఆ పోలీస్‌ని చంపేస్తారు. దీంతో సర్కార్‌ టీమ్‌ని ఏరేందుకు బోగరాజు సారథ్యంలోని పోలీస్‌ టీమ్‌ రంగంలోకి దిగుతుంది. వాళ్లకి దొరక్కుండా దేవదాస్‌ టీమ్‌ వేరే ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ ఓ హోటల్‌లో ఉంటుంది. అందులో పార్వతి(సంజనా కృష్ణమూర్తి) పరిచయం అవుతుంది. ఆమె అందులో పాటలు పాడుతూ జీవనం సాగిస్తుంది. ఆమెకి పడిపోతాడు దేవదాస్‌. ఆమెకి దగ్గరయ్యే క్రమంలోనే పొలీసులు దాడి చేస్తారు. ఈ దాడిలో పార్వతి చనిపోతుంది. దీంతో బాధపడతాడు దేవదాస్‌. పోలీసులకు దొరికిపోతాడు. కానీ ఆ తర్వాత తప్పించుకొని మరో ప్రాంతానికి వెళ్తాడు. ప్రాస్టిట్యూట్‌ గృహంలో ఉంటాడు. అక్కడ చంద్ర(వామికా గబ్బి) పరిచయం అవుతుంది. ఆమె తన బాధని పంచుకోగా, ఆ గృహం నుంచి విముక్తి కల్పిస్తాడు. అయితే పోలీసులు తర్వాత ఎటాక్‌ చేస్తారు. ఈ క్రమంలో దేవదాస్‌ టీమ్‌ నుంచి ఇద్దరు మరణిస్తారు. అంతేకాదు సర్కార్‌ని చంపేస్తారు. దేవదాస్‌ టీమ్‌ని లేపేసేందుకు స్కెచ్‌ వేస్తారు. మరి తన వాళ్లని చంపిన పోలీసులపై దేవదాస్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. చంద్రకి కొత్త లైఫ్‌ ఇచ్చాడా? దేవదాస్‌ డబ్బుకోసం ఆరాటపడుతుంటాడు. మరి ఆ డబ్బు ఎవరికి? చివరికి ఈ సినిమా ఎలాంటి ముగింపు తీసుకుందనేది మిగిలిన కథ.

36
డీసీ మూవీ విశ్లేషణ

ఇదొక గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే సినిమా. చూడ్డానికి యాక్షన్‌ ప్రధానంగా రన్‌ అవుతుంది. కానీ దీని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటుంది. చదువు కోసం హీరో పోరాటం ఉంటుంది. అదే సమయంలో పేద వారికి అన్యాయం చేసేవారిపై తిరుగుబాటు ఉంటుంది. అది పోలీసులే కావడం ఇందులో గమనార్హం. ఇదొక మనుగడ కోసం పోరాటం అని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి సీరియస్‌గా రన్‌ అవుతుంది. డైరెక్ట్ గా కథలోకి వెళ్తుంది. దీంతో ప్రారంభంలో కొంత కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. పోలీసులు సర్కార్‌ టీమ్‌ని లేపేసేందుకు అంత సీరియస్‌గా మారడమనేది కొంత కన్విన్సింగ్‌గా ఉండదు. కానీ ఆ తర్వాత ఇంటెన్సిటీతో రన్‌ అవుతుంది. సినిమాలో హీరోకి ఎక్కువ డైలాగ్‌లు ఉండవు, కానీ తన యాక్షన్‌, ఎక్స్ ప్రెషన్స్ తోనే మాట్లాడుతుంటాడు. అదే హైలైట్‌గా చెప్పొచ్చు. సినిమా స్లోగా అర్థమవుతుంది. యాక్షన్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. పార్వతి, దేవదాస్‌ కి సంబంధించిన ఎపిసోడ్‌ ఎమోషనల్‌గా ఉంటుంది. హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. ఆయా సీన్లు సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. పార్వతి పాత్ర ముగింపు కూడా బాధని కలిగిస్తుంది. మరోవైపు హీరో చాలా ఎమోషన్స్ ని తనలో దాచుకొని ప్రవర్తించే తీరు ఆకట్టుకుంటుంది. ఆయా సీన్లలో లోకేష్‌ కూడా చాలా బాగా చేశాడు. ప్రాస్టిట్యూట్‌ జీవితాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. అది కూడా ఆలోచింప చేస్తుంది. ఆ పాత్రలోనూ ఓ సందేశం ఉంటుంది. చాలా మంది పడే స్ట్రగుల్స్ ని అందులో చూపించారు. వారి జీవితాలు ఎలా ఉంటాయనేది, మనసులో బాధని దిగమింగుకొని వారు జీవించిన తీరు ఆలోచింప చేస్తుంది. అలాగే చంద్ర పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్‌ యాక్షన్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ యాక్షన్‌ తోపాటు ఎమోషన్స్ ఉంటుంది. ప్రాస్టిట్యూట్‌ గృహంలో ఉండే యాక్షన్‌ మాత్రం మతిపోయేలా ఉంటుంది. ఇందులో లోకేష్‌ రెచ్చిపోయి చేశాడు. తండ్రి కొడుకుల ఎమోషనల్‌ ఉంటుంది. అదే సమయంలో తండ్రి కూతురు ఎమోషన్‌ ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూట్‌ పడే బాధ ఉంటుంది. ఆమెలోని తిరుగుబాటు ఉంటుంది. ఆమెకి కొత్త ప్రపంచం పరిచయం చేయడం ఉంటుంది. తన జీవితంలో దగ్గరి వాళ్లని కోల్పోతున్న హీరోలోని బాధ ఉంటుంది. ఇలా అన్ని ఎమోషన్స్ ని మేళవించి దీన్ని తీసుకెళ్లారు. క్లైమాక్స్ యాక్షన్‌ మాత్రం అదిరిపోయింది. సినిమా కన్‌క్లూజన్‌ కూడా హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అయితే మూవీ మొత్తం లోకేష్‌ కనగరాజ్‌ స్టయిల్‌లో సాగుతుంది. ఆయనే డైరెక్టర్‌ అనేలా ఉంటుంది. బీజీఎం మాత్రం అదిరిపోయింది. పాటలు సైతం బాగున్నాయి. అనిరుథ్‌ అదరగొట్టాడు. అయితే కొంత స్లోగా ఉంటుంది. కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. లాజిక్స్ కూడా వదిలేశారు. పాత్రలకు సంబంధించిన క్లారిటీ మిస్‌ అయ్యింది. తెలుగు నటీనటులు లేరు. దీంతో కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది.

46
డీసీ మూవీ ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

దేవదాస్‌ పాత్రలో లోకేష్‌ కనగరాజ్‌ దుమ్ములేపాడు. సెటిల్డ్ గా చేశాడు. ఎక్స్ ప్రెషన్స్ తో నటించాడు. హవభావాలను పలికించాడు. యాక్షన్‌తో మైండ్‌ బ్లాక్‌ చేశాడు. ఎమోషనల్‌ సీన్లలోనూ బాగా చేశాడు. దర్శకుడే కాదు, ఆయనలో అదిరిపోయే నటుడు కూడా ఉన్నాడని నిరూపించాడు. పార్వతిగా సంజనా కృష్ణమూర్తి అందంగా ఉంది. అంతే బాగా యాక్ట్ చేసింది. ఆమె పాత్ర ఎమోషనల్‌కి గురి చేస్తుంది. ఇక చంద్ర పాత్రలో వామికా గబ్బి దుమ్ములేపింది. ప్రారంభంలో బాధపడుతూ కనిపించిన ఆమె, లోకేష్‌ తన లైఫ్‌లోకి రావడంతో తిరుగబడిన అమ్మాయిలా రెచ్చిపోయింది. తనలోని కొత్త యాంగిల్స్ చూపించి సర్‌ప్రైజ్‌ చేసింది. ఆమె సీన్లు వచ్చిన ప్రతి సారి వాహ్‌ ఫీలింగ్‌ తెప్పించింది. మిగిలిన పాత్రలు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

56
డీసీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

అనిరుథ్‌ మ్యూజిక్‌ సినిమాని వేరే లెవల్‌లో ఉంచింది. బీజీఎం సినిమాని నిలబెట్టింది. యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయేలా ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా బాగుంది. కలర్‌ టోన్‌ కొత్తగా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత షార్ప్ చేయోచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు అరుణ్‌ మంచి కథని ఎంచుకున్నాడు. దాన్ని అంతే బాగా తెరకెక్కించాడు. అయితే కాన్సెప్ట్ యూనివర్సల్ కావడంతో అందరికి నచ్చుతుంది. కాకపోతే కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది. అదే సమయంలో సినిమా మొత్తం లోకేష్‌ మార్క్ కనిపించడం విశేషం. యాక్షన్‌ సీన్లు, క్లైమాక్స్, హీరో పాత్ర ఇచ్చే ట్విస్ట్ లు, సస్పెన్స్ లు కూడా లోకేష్‌ సినిమాలను తలపిస్తాయి. అదే ఈ మూవీకి ప్లస్‌ గా చెప్పొచ్చు. సినిమాలో పోయిటిక్‌ స్టయిల్‌ కనిపిస్తుంది. ఆయా పోయెటిక్‌ ఎలిమెంట్లు కొంత స్లోగా అనిపించినా ఆకట్టుకుంటాయి.

66
ఫైనల్‌ గా

లైట్‌గా హార్ట్ టచ్‌ చేస్తూ యాక్షన్‌, ఎమోషనల్‌గా మెప్పించే డీసీ. లోకేష్‌ కనగరాజ్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.

రేటింగ్‌ : 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories