ఇన్నాళ్లకు మెరిసిన తెలుగు హీరోయిన్ లయ.. చీరకట్టులో కట్టిపడేస్తున్న సీనియర్ నటి.. ఆమె ఎక్కడున్నారంటే?

First Published | Jan 29, 2023, 11:51 AM IST

తెలుగు హీరోయిన్ లయ (Laya) సినిమాకు దూరంగా ఉన్నా... నెట్టింట మాత్రం తన అభిమానులను పలకరిస్తూనే ఉంది.  తాజాగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. 
 

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ అచ్చమైన తెలుగమ్మాయి. ఏపీలోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. చిన్పప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగుపెట్టింది. 1992లో స్ట్రీట్ చైల్డ్స్ పై వచ్చిన ‘భద్రం కొడుకో’ చిత్రంలో బాలనటిగా మెప్పించింది. ఆ తర్వాత  కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చి హీరోయిన్ గా మెరిసింది. 
 

1999లో వచ్చిన ‘స్వయంవరం’ చిత్రంలో వేణు తొట్టెంపూడి సరసన నటించింది. లయ హీరోయిన్ గా మొట్టమొదటి చిత్రమిది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో తొలిచిత్రంతోనే హిట్ అందుకుంది. 
 


ఇలా ఫ్యామిలీ సినిమాలతో 2006 వరకు అలరించింది. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కనిపించింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అయితే అప్పటికే కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని 2006లో పెళ్లి చేసుకుంది. 
 

వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం లయ కుటుంబంతో సహా అమెరికాలోని కాలిఫోర్నియాలోనే సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అవుతూ వచ్చింది. చివరిగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వెండితెపై కనిపించడం లేదు. 

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. మరోవైపు రీల్స్, డాన్స్ వీడియోలతో ఆకట్టుకుంటుంది. మరోవైపు సంప్రదాయ దుస్తులోనూ మెరుస్తూ కట్టిపడేస్తోందీ ఫ్యామిలీ హీరోయిన్ లయ.

తాజాగా గ్రేకలర్ ప్రింటెడ్ శారీలో సీనియర్ నటి మరింత అందంగా  కనిపిస్తోంది. చీరకట్టులో హోయలు పోతూ నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. తన అందంతో ఇప్పటికీ ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!