మీరా జాస్మిన్ సినిమాల్లో క్యూట్ గా కనిపిస్తుంది. అయితే ఆమెకు యాటిట్యూడ్ మాత్రం చాలా ఎక్కువ అట. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కి కూడా ఆమె యాటిట్యూడ్ చూపారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం అనేది తెలియదు.
మీరా జాస్మిన్ హోమ్లీ రోల్స్ కి పెట్టింది పేరు. రన్, పందెం కోడి, భద్ర వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అమ్మాయి బాగుంది చిత్రంతో ఆమె టాలీవుడ్ కి పరిచయమైంది. శివాజీ హీరోగా నటించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. రవితేజతో చేసిన భద్ర మంచి విజయం అందుకుంది.