అతడు లేకుంటే చిరంజీవి కెరీర్ ఎలా ఉండేదో ఊహించలేం, చేసిందంతా ఆ ఒక్కడే.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్

Published : Feb 18, 2026, 03:21 PM IST

చిరంజీవి 1978లో కెరీర్ ప్రారంభించి మెగాస్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. తన ప్రతిభ కష్టంతో ఎదిగిన చిరంజీవిపై సీనియర్ హీరో ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
Chiranjeeviచిరంజీవి క్రేజ్

ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఓ చరిత్ర సృష్టించారు. చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నటన, డ్యాన్సులలో అదరగొడుతూ, చలాకీగా ఉంటూ అందరి దృష్టిలో పడ్డారు. ఐదేళ్లపాటు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఖైదీ తో టాలీవుడ్ లో సరికొత్త స్టార్ గా చిరంజీవి అవతరించారు.

25
చంద్రమోహన్ రెమ్యునరేషన్

చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో చిరంజీవి ఎన్టీఆర్, కృష్ణ, చంద్రమోహన్ లాంటి సీనియర్ హీరోలతో నటించారు. చిరంజీవి ఇండస్ట్రీలో రాణించడానికి కారణం అతని స్వయంకృషి అనేది అందరి అభిప్రాయం. కానీ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు అతడి రెమ్యునరేషన్ 5 వేలు అయితే తన రెమ్యునరేషన్ 25 వేలు అని చంద్రమోహన్ అన్నారు.

35
ఆ ఒక్కడి వల్లే..

చిరంజీవి డ్యాన్సులు, నటనతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కెరీర్ ఎదగడానికి కారణం ఒకే ఒక్కడు అని చంద్రమోహన్ అన్నారు. ఆ ఒక్కడు ఎవరో కాదు.. అల్లు అరవింద్ అని చంద్రమోహన్ తెలిపారు.

45
అతడు లేకపోతే చిరంజీవి కెరీర్ పరిస్థితి ?

చిరంజీవి అర్జునుడి లాంటి వాడు అయితే.. అల్లు అరవింద్ కృష్ణుడు లాంటి వాడు. కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఇబ్బంది పడే వాడు కదా అన్నట్లుగా చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఎలాంటి సినిమాలు చేయాలి ? ఎలాంటి దర్శకులని ఎంచుకోవాలి లాంటి ప్లానింగ్ మొత్తం అల్లు అరవింద్ చేసేవారు అని చంద్రమోహన్ అన్నారు.

55
అప్పటికే అభిమానుల్లో గుర్తింపు

ఇదే తరహా ప్రశ్న ఓ సందర్భంలో చిరంజీవికి ఎదురైంది. అల్లు రామలింగయ్య సపోర్ట్ చిరంజీవికి బాగా ఉపయోగపడింది అనే కామెంట్స్ కి మెగాస్టార్ సమాధానం ఇచ్చారు. అల్లు రామలింగయ్య సపోర్ట్ ఇవ్వలేదు, ఆశీస్సులు ఇచ్చారు అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. సురేఖతో పెళ్లి జరిగే సమయానికే ఆడియన్స్ కి నా గురించి తెలిసింది. నా సినిమాలని ఆడియన్స్ బాగా కోరుకునే వారు అని చిరంజీవి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories