పిల్లల్ని కనే అదృష్టం నాకు లేదు.. స్టార్ సింగర్ ఆవేదన..

చాలామంది స్టార్ సెలబ్రిటీలు పిలల్ని కనే అవకాశం ఉన్నా.. రకరకాల కారణాల వల్ల సరోగసిని ఆశ్రయిస్తున్నారు. కాని అంత పెద్ద స్టార్ అయ్యింది ఈ అమ్మాయి మాత్రం పిల్లల్ని కనే అదృష్టం లేకుండా పోయిందని ఆవేదన చెందుతోంది. 
 

Image: Getty Images

కాస్త స్టార్ డమ్ వచ్చి.. కోట్లకు కోట్లు డబ్బులు వచ్చిపడుతుంటే చాలు.. లేటుగా పెళ్ళి చేసుకుని.. పిల్లలని కనడానికి ఇబ్బంది పడుతుంటారు కొంత మంది హీరోయిన్లు.  అవును పిల్లల్ని కంటే అందం చెడిపొతుందని.. రిస్క్ అవుతుందని.. షేప్ అవుట్ అవుతామని.. ఇలా రకరకాల కారణాలతో సరోగసీని ఆశ్రయించిన తారలెంతమందో.. 

అయితే ఆలియా భట్, దీపికా, కరీనా, కాజల్, ప్రణీత, ఇలా చాలామంది హీరోయిన్లు మాత్రం తమ పిల్లలను నవమాసాలు మోసి కన్నారు. పిల్లలను చాలా చక్కగా పెంచుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కాకపోతే అందరూ ఇలా కనాలని ఆలోచించడం లేదు. 

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
 

Image: Getty Images

కొంత మంది మాత్రం పిల్లలను కనడానికి హెల్త్ ప్రాబ్లమ్స్ అడ్డు వచ్చి.. సరోగసి వైపు చూస్తుంటారు. ఇలారకరకాల కేసులు సమాజంలో జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఓ పాప్ సింగర్.. స్టార్ గాయకురాలు మాత్రం తనకు బిడ్డను నవమాసాలు మోసి కనాలని అనిపిస్తుంది అంటోంది. 

ఆమె  ఎవరో కాదు అమెరికన్ స్టార్ పాప్ సింగర్ సెలీనా గోమెజ్. ఈ హాలీవుడ్ స్టార్ సింగర్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన పాటలతో వరల్డ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.

బ్యూటీలోను ఆమె హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు. ప్రపంచ ప్రేక్షకులని మెప్పించిన ఈ తార  మరో స్టార్ సింగర్.. అమెరికన్ గాయకుడు  జస్టిన్ బీబర్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి బ్రేకప్ కూడా అయింది.

ప్రభాస్ కల్కి 2898 AD నుంచి ఎవరు చూడని అరుదైన ఫోటోలు..
 


Image: Getty Images

అయితే  ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. సెలీనా గోమెజ్ మాట్లాడుతూ.. నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను. వాటిని అధిగమించడానికి  పోరాడుతున్నాను. నేను అసలు పిల్లల్ని కనలేను. ఒక వేళ కనాలి అని ప్రయత్నం చేసినా కూడా.. దాని వల్ల నాకు, నా బిడ్డకు కూడా ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. 

ఆ విషయంలో నేను బాధపడుతున్నాను. నా బిడ్డను నేను కని.. నాచేతులతో పెంచుకోవాలని అని ఆశపడ్డాను. ఇక అది సాధ్యం కాదు అని తెలిసి.. ఎవర్నైనా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను అని వివరించి  ఎమోషనల్ అయింది సెలీనా గోమెజ్. అయితే అసలు తన ఆరోగ్య సమస్య ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు. దీంతో సెలీనా గోమెజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

selena gomez

సెలీనా గోమెజ్ ఎప్పట్నుంచో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. గతంలో ఆమెకు కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. ప్రస్తుతం సెలీనా ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుంది. దీని వల్ల ఆమె శరీరంలోని రోగనిరోధక శక్తి నశించడమే కాకుండా శరీరంలోని పలు అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంది. 

ఇక ఈ విషయంలో సెలీనా గోమెజ్ కి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆమెకు ధైర్యం చెపుతూ.. అభిమానులు కొన్ని లక్షల పోస్ట్ లు పెడుతున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న అభిమానులు కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు. నీకు మేమంతా ఉన్నాం.. ధైర్యంగా ఆ సమస్యను అధిగమించు అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Latest Videos

click me!