షారుఖ్ కుమార్తె సుహానా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం సుహానా ఆర్డింగ్లీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. న్యూయార్క్‌లోని ఆర్ట్స్ స్కూల్ నుండి నటనలో డిగ్రీ పొందారు.
2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన “ది ఆర్చీస్” చిత్రం ద్వారా సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. డిజిటల్ ఎంట్రీ అనంతరం సిల్వర్ పై సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. తండ్రి షారుఖ్ ఖాన్‌తో పాటు “ది కింగ్” అనే చిత్రంలో సుహానా నటించనుంది. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది తెరకెక్కుతోంది.
కేవలం 24 ఏళ్ల వయసులోనే సుహానా ఖాన్ సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేసింది. సుహానా ఖాన్ సినిమాలకే పరిమితం కాకుండా మేబెల్లిన్, లక్స్ వంటి బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరించింది.
బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా చిన్న వయసులోనే అపార సంపదను కూడబెట్టింది. ఆమె నికర ఆస్తుల విలువ రూ.13 కోట్లు అని సమాచారం.
సుహానా ఖాన్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని అలీబాగ్‌లోని తాల్ గ్రామంలో రూ. 12.91 కోట్లకు ఒక ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంట్లో 2,218 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు విల్లాలు ఉన్నాయి.
అంతేకాకుండా తాల్ గ్రామంలోనే రూ.9.5 కోట్ల విలువైన మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌కు రూ. 70 లక్షల విలువైన ఆడి A6 కారును బహుమతిగా ఇచ్చారు.
సుహానా ఖాన్ తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.2024 న్యూ ఇయర్ వేడుకలో బ్లాక్ బాడీకాన్ మినీ డ్రెస్‌లో మెరిశారు. బంగారు ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన ఈ అందమైన డ్రెస్ ధర రూ. 2,70,000.
సుహానా ఖాన్ తన తల్లి గౌరీ ఖాన్ వలె లగ్జరీ హ్యాండ్‌బ్యాగులను కొనడానికి ఇష్టపడుతుంది. న్యూయార్క్‌లోని టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుతున్నప్పుడు, ఆమె రూ. 1.23 లక్షల విలువైన గ్రీన్ ప్రాడ బ్రష్డ్ లెదర్ మినీ బ్యాగ్‌తో కనిపించింది.