శేఖర్‌ మాస్టర్‌ మంచి కళా పోషకుడే.. పెళ్లైన యాంకర్‌తో పబ్లిక్‌గా పులిహోర కలిపి రచ్చ..

First Published | Aug 7, 2024, 11:36 AM IST

స్టార్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌.. మంచి డాన్సర్‌ మాత్రమే కాదు, మంచి రొమాంటిక్‌ కూడా. తాజాగా ఆయన పెళ్లైన యాంకర్‌తో పబ్లిక్‌గా పులిహోర కలపడం షాకిచ్చింది. 
 

శేఖర్‌ మాస్టర్‌ మామూలు అసిస్టెంట్‌ నుంచి ఇప్పుడు స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా ఉన్నాడు. ఓ వైపు స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ, మరోవైపు టీవీ షోస్‌ తో బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో తనదైన కామెడీతో అలరిస్తున్నాడు. 
 

శేఖర్‌ మాస్టర్‌ ఓ వైపు `ఢీ` షోకి జడ్జ్ గా చేస్తున్నాడు. చాలా ఏళ్లుగా ఆయన జడ్జ్ గా రాణిస్తున్నారు. దీంతోపాటు స్టార్‌ మాలో `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షో చేస్తున్నాడు. ఇందులో బాయ్స్ టీమ్‌కి లీడర్‌గా, జడ్జ్‌ గా ఉన్నాడు. తనకు అపోజిట్‌గా అనసూయ ఉంది. ఈ ఇద్దరు కలిసి చేసే రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. అదే ఇప్పుడు ఈ షోని టాప్‌ రేటింగ్ లో ఉంచిందని చెప్పొచ్చు. 
 


ఇదిలా ఉంటే సందు దొరికితే అమ్మాయిలతో, యంకర్లతో పులిహోర కలుపుతూ హాట్‌ టాపిక్‌ అవుతున్నారు శేఖర్‌ మాస్టర్. ఇప్పుడు మరోసారి ఆయన రెచ్చిపోయాడు. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోలో ఆయన అనసూయతో పులిహోర కలపడం విశేషం. ఇందులో పార్టీ సెలబ్రేషన్‌ పేరుతో ప్రత్యేకంగా స్కిట్‌ చేశారు. ఇందులో పాల్గొన్న అందరు జంటలుగా వచ్చి అలరించారు. 
 

ఈ క్రమంలో శేఖర్‌ మాస్టర్‌ పెళ్లైన అనసూయతో కలిసి వచ్చాడు. ఇద్దరు ప్రేమికులుగా ఆడుతూపాడుతూ ఎంట్రీ ఇచ్చారు. అంతే క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. శేఖర్‌ మాస్టర్‌ని పట్టుకుని అనసూయ.. మాస్టర్‌ ఈ సారి పార్టీ చివరి వరకు ఉండాల్సిందే, మధ్యలో వెళ్లిపోవడానికి లేదు అని అంటుంది. దీనికి మాస్టర్‌ రియాక్ట్ అవుతూ ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని చివరి వరకు ఉండకుండా ఎలా ఉంటాను చెప్పు అని అంటాడు. దెబ్బకి ఫిదా అయిపోతుంది అనసూయ. 
 

మధ్యలో కల్పించుకున్న యాంకర్‌ శ్రీముఖి.. మాస్టర్‌ ఈ రోజు పార్టీకి క్యాటరింగ్‌ క్యాన్సిల్‌ చేస్తున్నా అని తెలిపింది. ఓకే అంటాడు శేఖర్‌ మాస్టర్. ఎందుకంటే మొత్తం పులిహోర ఇక్కడే కలిపేస్తున్నారుగా, ఇక క్యాటరింగ్‌ అవసరం లేదని చెబుతుంది శ్రీముఖి. ఆ సమయంలో శేఖర్ మాస్టర్‌ అనసూయ చేయిని నలిపేస్తూ కనిపించాడు. దీంతో షోలో మొత్తం అరుపులతో దద్దరిల్లింది. 
 

దీనికి మాస్టర్‌ స్పందిస్తూ, పార్టీ ఉందని కలిసి వచ్చామని చెప్పగా, పార్టీ ఉందని చెప్పా, పోటీ లేదని చెప్పలేదని అనగా, పార్టీ ఉందని కలిసి వచ్చాం. పోటీ అంటే కలబడతాం చూడు అంటూ మరోసారి అనసూయ చేతిని నలిపేశాడు. దీన్ని తట్టుకోని శ్రీముఖి.. మాస్టర్‌ దీన్ని కలిపేయడం అంటారు వదిలేయండి అంటూ అరవడం హైలైట్‌గా నిలిచింది. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` లేటెస్ట్ ప్రోమోలో ఇది హైలైట్గా నిలిచింది. ఆద్యంత ఆకట్టుకుంది. ఇందులో అనసూయ సైతం తనదైన గ్లామర్‌ ట్రీట్‌తో ఆకట్టుకుంది. 
 

Latest Videos

click me!