రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన సమంత... హనీ బన్నీ కి ఎంత తీసుకుందో తెలుసా?

First Published | Aug 7, 2024, 10:46 AM IST

ఓ హీరో రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది సమంత. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సమంత తాజాగా నటించిన హనీ బన్నీ సిరీస్ కోసం కోట్లలో రాబట్టిందట. 
 

Honey Bunny Teaser

సమంత ఓ ఏడాది పాటు విరామం తీసుకుంది. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆమె బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. కాగా ఆమె హనీ బన్నీ సిరీస్ షూటింగ్ పూర్తి చేశారు. గత ఏడాది వరుస షెడ్యూల్స్ లో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీ షూట్ లో ఆమె పాల్గొన్నారు. 

Honey Bunny Teaser

ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీ రోల్ చేయడం సమంతకు చాలా ప్లస్ అయ్యింది. ఆమెకు ఇండియా వైడ్ ఫేమ్ దక్కింది. ది ఫ్యామిలీ మ్యాన్ కి మించిన రిస్కీ అండ్ బోల్డ్ రోల్ చేసింది సమంత. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ హనీ బన్నీలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. హనీ బన్నీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. 


Honey Bunny Teaser

నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో హనీ బన్నీ అందుబాటులోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేశారు. హనీ బన్నీ టీజర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఉన్నత నిర్మాణ విలువలు, గూస్ బంప్స్ రేపే యాక్షన్ ఎపిసోడ్స్, భారీ ఛేజింగ్స్, రిచ్ విజువల్స్ తో కూడిన హనీ బన్నీ టీజర్ అంచనాలు పెంచేసింది. సమంత లుక్ మరో హైలెట్ అని చెప్పాలి. 

వరుణ్ ధావన్ ని ఆమె డామినేట్ చేసినట్లు స్పష్టం అవుతుంది. సమంత చాలా స్టైలిష్ గా ఉంది. కాగా ఒరిజినల్ సిటాడెల్ లో ప్రియాంక చోప్రా-రిచర్డ్ మాడెన్ మధ్య శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా ఈ సన్నివేశాలు చేసేందుకు ఇబ్బందిపడ్డానని చెప్పడం విశేషం. కో స్టార్ సహకారంతో పూర్తి చేయగలిగాను అన్నారు. అదే తరహాలో వరుణ్ ధావన్-సమంత మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయా అనే సందేహం ఉంది. 

కాగా ఈ సిరీస్ కోసం సమంత భారీగా రాబట్టిందట. హనీ బన్నీ సిరీస్ కోసం సమంత ఏకంగా రూ. 10 కోట్లు తీసుకున్నారట. ఇది టైర్ టు హీరో తీసుకునే రెమ్యూనరేషన్ తో సమానం. అంత మొత్తంలో ఆమె రాబట్టారు. దీపికా పదుకొనే మాత్రమే రూ. 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. తాజాగా ఈ లిస్ట్ లో సమంత చేరింది. 

Latest Videos

click me!