నవీన్ పోలిశెట్టికి పెళ్ళైయ్యిందా..? అందుకే ఆయన అక్కడి నుంచి రావడంలేదా..?

First Published | Aug 7, 2024, 10:45 AM IST

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నవీన్ పోలిశెట్టి కి పెళ్ళైపోయిందా..? ఎవరికీ తెలియకుండా ఆయన సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్నాడా..? ఆయన ఎక్కువగా అమెరికాలో ఉండటానికి కారణం ఏంటి..? 
 

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో  న‌వీన్ పోలిశెట్టి. కామెడీ ప్లస్ హీరోయిజం రెండు కలగలిపి.. సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సాధించాడు నవీన్. హీరోగా  మొట్టమొదటి సినిమానే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు ఈ హీరో. ఆతరువాత న‌వీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో భయంకరమైన  క్రేజ్ సంపాదించుకున్నాడు.  ఇండస్ట్రీలో అందరు హీరోలకు సాధ్యం కానిది తను చేసి చూపించాడు. 

కామెడీ టైమింగ్.. ఫ్యాన్స్ ను అలరించే నవీన్.. లాస్ట్ ఇయర్ అనుష్క జతగా.. మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి  సినిమాతో ఫ్యాన్స్ ను మరోసారి అలరించాడు నవీన్.  వరుసగా మూడు సినిమాలతో  హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు నవీన్. అయితే ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా..నవీన్ మాత్రం వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు. 
 


చాలా కాలంకనిపించకపోవడంతో..నవీన్ ఏం చేస్తున్నాడని అంతా ఆరాతీయ్యడం స్టార్ట్ చేశారు.  మిస్ట్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి రిలీజ్ టైమ్ లో అమెరికా వెళ్ళిన  న‌వీన్.. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్  కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన అక్కడ ఏం చేస్తున్నాడా అని ఫ్యాన్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ.. నవీన్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. 

అక్క‌డ ఓ యాక్సిడెంట్ జ‌ర‌గ‌డంతో.. న‌వీన్ పోలిశెట్టి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.  కూడి చేయి బాగా ఫ్యాక్చర్ అయింది. దాంతో న‌వీన్ ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ఈ విషయాన్ని తన సోష‌ల్ మీడియా ద్వారా  తెలిపిన నవీన్.. త‌న హెల్త్ అప్డేట్స్ ను  ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు శేర్ చేస్తూ వచ్చాడు. తాను కంప్లీట్ గా కోలుకున్నాక నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇస్తానని ఆయన అన్నారు. 

అయితే ఈక్రమంలోనే నవీన్ పై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా నవీన్ కు సబంధంచిన మరో  షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. అదేంటంటే..న‌వీన్ పోలిశెట్టికి పెళ్లైపోయింద‌ని.. అది కూడా  అమెరికాలో. అక్కడ ఉన్న ఓ అమ్మాయిని ఆయన రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడని.. ఆమెను ప్రేమించాడా..? లేక పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్ళాడాడా.. తెలియదు కాని..  ఓ అమ్మాయిని మాత్రం సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

న‌వీన్ పోలిశెట్టి పెళ్ళి జరిగి కూడా నాలుగైదు నెలలు అవుతుందని న్యూస్ హల్ చల్ చేసింది. అందుకే ఆయన అమెరికాను వదిలి రావడం లేదని కూడా అంటున్నారు. అయితే నవీన్ టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. అంతే కాదు ఈ విషయంలో నిజం లేదని.. నవీన్ ఆడియన్స్ కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.  పెళ్ళి వార్తలను న‌వీన్ పోలిశెట్టి ఖండించారు కూడా.. అవి పుకార్లని.. పెళ్ళి చేసుకుంటే అందరిని పిలుస్తానని కూడా ఆయన అన్నారట. 

ఇక నవీన్ చేతిలో మూడు సినిమాలకు సబంధించిన వర్క్ జరుగుతోంది. యాక్సిడెంట్ నుంచి కోలుకోగానే ఆయన ఆ సినిమాలు స్టార్ట్ చేస్తారని అంటున్నారు. కాగా.. నవీన్.. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ లో  సడెన్ గా ప్రత్యక్ష్యం అయ్యారు. ఫిల్మ్ ఫేర్ అవ్వగానే ఆయన మళ్ళీ కనిపించకుండాపోయారు. కొందరు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారని అంటుంటే.. మరికొందరు మాత్రం ముంబయ్  వెళ్ళినట్టు చెపుతున్నారు. 

Latest Videos

click me!