విజయవాడలో ఖరీదైన ల్యాండ్ కోసం అప్పు చేసి డబ్బు కట్టిన శేఖర్ మాస్టర్..నిలువునా ముంచేశారుగా

Published : Feb 26, 2024, 03:23 PM IST

టాలీవుడ్ లో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల చిత్రాల్లో తప్పనిసరిగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉంటుంది.

PREV
16
విజయవాడలో ఖరీదైన ల్యాండ్ కోసం అప్పు చేసి డబ్బు కట్టిన శేఖర్ మాస్టర్..నిలువునా ముంచేశారుగా

టాలీవుడ్ లో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల చిత్రాల్లో తప్పనిసరిగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఉంటుంది. ఢీ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ బుల్లితెరపై కూడా దుమ్ములేపుతున్నారు.  

26

అప్పుడప్పుడూ శేఖర్ మాస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు కూడా హాజరవుతుంటారు. అలాంటి సమయంలో హైపర్ ఆది శేఖర్ మాస్టర్ పై వేసే జోకులు బాగా హైలైట్ అవుతుంటారు. శేఖర్ మాస్టర్ ఎక్కువగా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుంటాడు అని హైపర్ ఆది తరచుగా కామెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

36

శేఖర్ మాస్టర్ టాలీవుడ్ లో పేరున్న కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన రెమ్యునరేషన్ బాగానే ఉంటుంది. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శేఖర్ మాస్టర్ లాంటి సెలెబ్రిటీ కూడా ఓ ల్యాండ్ విషయంలో మోసపోయారట. 

46

విజయవాడ దగ్గరలో విజయవాడ- హైదరాబాద్ రహదారి పక్కన శేఖర్ మాస్టర్ ఒక స్థలాన్ని కొన్నారట. మంచి ధర వచ్చినప్పుడు అమ్మేయాలని అనుకున్నారు. తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసినవాళ్ళు ఉంటే వాళ్లే ఆ స్థలం కొనిచ్చారట. తెలిసిన వాళ్లే కాదా అని అప్పు చేసి మరీ ఆ స్థలానికి తాను డబ్బు కట్టినట్లు శేఖర్ మాస్టర్ తెలిపారు. 

56

తామే ఆ స్థలాన్ని అమ్మిస్తామని కూడా చెప్పారట. కోవిడ్ తర్వాత భూముల ధరలు బాగా పడిపోయాయని అంత ధర చేయదని చెప్పారట. సరే ఎంతోకంత పర్వాలేదు.. అమ్మేయండి.. నేను ఆ డబ్బుని అప్పులవాళ్ళకి కట్టాలి అని చెప్పారట. ఆ తర్వాత ఆ స్థలమూ లేదు.. అమ్మిన వాళ్ళు కూడా ఫోన్ స్విచాఫ్ చేశారు. దీనితో తాను మోసపోయినట్లు శేఖర్ మాస్టర్ గ్రహించారు. 

66

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి జాగ్రత్తగా డబ్బు సేవ్ చేసుకుంటున్నానని శేఖర్ మాస్టర్ అన్నారు. కానీ చివరికి ఇలా మోసపోవాల్సి వచ్చింది అని తెలిపారు. విజయవాడలోనే జక్రియ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు పరిచయం లేదు. మా అత్తగారి ద్వారా పరిచయం అయ్యాడు. ఆయన మంచి స్థలం ఇప్పిచాడు. ఆ తర్వాత అమ్మింది కూడా ఆయనే. ఆ స్థలంతో మంచి డబ్బులే వచ్చాయి. ఎవరో తెలియని వ్యక్తి నా కోసం బాగా చేశాడు.. కానీ తెలిసిన వాళ్ళు మోసం చేసారు అని శేఖర్ మాస్టర్ అన్నారు. 

click me!

Recommended Stories