హీరోయిన్ ఖుష్భూ తెలుగువారందరికీ పరిచయమే. విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది.
హీరోయిన్ ఖుష్భూ తెలుగువారందరికీ పరిచయమే. విక్టరీ వెంకటేష్ నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులు. ఆ చిత్రంతోనే ఖుష్బూ హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. కలియుగ పాండవులు తర్వాత తెలుగు తమిళ భాషల్లో కుష్బూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
26
సెకండ్ ఇన్నింగ్స్ లో ఖుష్బూ తెలుగులో స్టాలిన్, యమదొంగ, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఖుష్బూ పొలిటికల్ గా కూడా బిజీగా ఉంటోంది. ఈ మధ్యన ఖుష్బూ జబర్దస్త్ జడ్జిగా కూడా మారిన సంగతి తెలిసిందే.
36
ఖుష్భూ రాజకీయ నాయకురాలు కూడా. ప్రస్తుతం ఖుష్భూ బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. ఖుష్భూ కీలక పదవిలో భాద్యతలు నిర్వహిస్తున్నారు. నేషనల్ ఉమెన్ కమిషన్ లో ఖుష్బూకి సభ్యురాలిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆమె మహిళల కి సంబంధించిన విషయాలపై తరచుగా గళం విప్పుతున్నారు.
46
తాజాగా ఓ కార్యక్రమంలో ఖుష్బూ మాట్లాడుతూ.. తన తల్లి పట్ల తండ్రి వ్యవహరించిన తీరు ఇతర మహిళలకు జరగకూడదు. కాబట్టి మహిళలు నిస్సహాయతతో ఉండకూడదు అని ఖుష్బూ అన్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించిన యానిమల్ మూవీ పై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
56
అసలు యానిమల్ లాంటి చిత్రం అంత పెద్ద విజయం ఎలా సాధించిందో అర్థం కావడం లేదు. నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది. ప్రజల మనస్తత్వాలు ఈ రకంగా ఉన్నాయని తెలిస్తే షాకింగ్ గా ఉంది. ఇలాంటి మనస్తత్వాలు ఉండడం ఎప్పటికైనా సమస్యే అని ఖుష్బూ అన్నారు. ఎందుకంటే సినిమాల్లో చూపించేవే బయట కూడా జరుగుతున్నాయి.
66
యానిమల్ లాంటి చిత్రాలు సమాజానికి మంచిది కాదు అన్నట్లుగా ఖుష్బూ కామెంట్స్ చేశారు. ఆల్రెడీ ఇప్పటికే తమిళ సెలబ్రిటీలు కొందరు యానిమల్ మూవీపై విమర్శలు చేశారు. నటి కస్తూరి శంకర్ కూడా ఈ చిత్రం చూడడం ప్రారంభించిన కొద్ది సేపటికే చిరాకు పుట్టినట్లు పేర్కొంది.