ఆ స్టార్ హీరోనే నా భర్త, ఎట్టకేలకు పేరు రివీల్ చేసిన అమీషా పటేల్... లక్కీ ఫెలో ఎవరంటే? 

Published : Feb 26, 2024, 02:34 PM IST

హీరోయిన్ అమీషా పటేల్ ప్రస్తుత వయసు 48 ఏళ్ళు. ఆమె వివాహం చేసుకోలేదు. అయితే అమీషా పటేల్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యిందట. ఓ స్టార్ హీరో నా భర్త అంటూ పేరు రివీల్ చేసింది. దాంతో అందరూ షాక్ అయ్యారు.   

PREV
17
ఆ స్టార్ హీరోనే నా భర్త, ఎట్టకేలకు పేరు రివీల్ చేసిన అమీషా పటేల్... లక్కీ ఫెలో ఎవరంటే? 

అమీషా పటేల్ కెరీర్ గ్రాండ్ గా మొదలైంది. ఆమె డెబ్యూ మూవీ కహోనా ప్యార్ హై బ్లాక్ బస్టర్ కొట్టింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రెండో చిత్రం బద్రి. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. 
 

27

పవన్ కళ్యాణ్ కి జంటగా అమీషా పటేల్ నటించిన బద్రి సూపర్ హిట్. మూడో చిత్రం గదర్. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ పేట్రియాటిక్ లవ్ డ్రామా బాక్సాఫీస్ షేక్ చేసింది. అతిపెద్ద విజయం నమోదు చేసింది. అలా అమీషా పటేల్ అరంగేట్రంలోనే హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. 

 

37

బద్రి అనంతరం అమీషా పటేల్ కి తెలుగులో హిట్స్ పడలేదు. ఎన్టీఆర్, మహేష్ లకు జంటగా నటించిన నరసింహుడు, నాని డిజాస్టర్ అయ్యాయి. ఇక బాలయ్యతో చేసిన పరమవీర చక్ర ట్రిపుల్ డిజాస్టర్ అని చెప్పాలి. దాంతో అమీషా పటేల్ కి తెలుగులో ఆఫర్స్ రాలేదు. ఆమె హిందీలో చిత్రాలు చేశారు. 

47

ఫేడ్ అవుట్ అయిన అమీషా పటేల్ కెరీర్లో గదర్ 2 సక్సెస్ ఒక మిరాకిల్ అని చెప్పాలి. దాదాపు పాతికేళ్ల అనంతరం సన్నీ డియోల్, అమీషా పటేల్ జతకట్టారు. గదర్ 2 వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 


 

57

అమీషా అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే... అమీషా పటేల్ ఏజ్ ఐదు పదులకు దగ్గరైంది. అమీషాకు పెళ్లీడు ఎప్పుడో దాటిపోగా ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే ఆల్రెడీ నాకు వివాహం జరిగింది. ఓ స్టార్ హీరో నా భర్త అని బాంబ్ పేల్చింది. 

67


అమీషాను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవరని అందరూ తలలు బద్దలు కొట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అట. టామ్ క్రూజ్ అంటే అమీషా పటేల్ కి చచ్చేంత ఇష్టం అట. అతనితో మానసికంగా తనకు పెళ్లి అయిపోయిందట. తన మనసులో టామ్ క్రూజ్ ని అమీషా భర్తగా భావిస్తోందట. 
 

77


కాబట్టి అమీషా పటేల్ ని టామ్ క్రూజ్ భౌతికంగా వివాహం చేసుకోనప్పటికీ... తన భర్త అతడే అని అమీషా పటేల్ మనసులో మాట బయటపెట్టింది. అదన్నమాట సంగతి. 
 

Read more Photos on
click me!

Recommended Stories