సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తనను 'అల్లు అర్జున్ ప్రాపర్టీ' అని పిలవడంతో నటి సీరత్ కపూర్ ఘాటుగా స్పందించింది. మహిళల వ్యక్తిత్వం, ఆత్మగౌరవం గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఆమె ఇచ్చిన ఘాటు కౌంటర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి, మోడల్ సీరత్ కపూర్ తాజాగా వార్తల్లో నిలిచింది. ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో కింద ఓ నెటిజన్ అసభ్యకరమైన కామెంట్ పెట్టాడు. దీనిపై సీరత్ ఘాటుగా స్పందించింది.
26
అల్లు అర్జున్ ప్రాపర్టీ అని కామెంట్స్
సీరత్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సెల్ఫీని షేర్ చేసింది. చాలా మంది ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టగా, ఒక నెటిజన్ మాత్రం 'అల్లు అర్జున్ ప్రాపర్టీ' అని రాశాడు. ఈ కామెంట్ మహిళలను కించపరిచేలా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
36
హుందాగా స్పందించిన సీరత్ కపూర్..
ఆ కామెంట్‌ను సీరత్ కపూర్ పట్టించుకోకుండా వదిలేయలేదు. ఎంతో హుందాగా, స్పష్టంగా సమాధానమిచ్చింది. 'లవ్-ఐడ్ ఎమోజీ పెడితే గౌరవంగా ఉన్నట్టు కాదు. మహిళ ఎవరి ఆస్తి కాదు. ఆమెకు సొంత గుర్తింపు, కలలు, గొంతు ఉంటాయి. గౌరవంగా మెచ్చుకోండి, బాగుండండి' అని ఆమె బదులిచ్చింది.
సీరత్ కపూర్ ఈ సమస్యను ఎదుర్కొన్న తీరుకు అభిమానులు , నెటిజన్లు ఫిదా అయ్యారు. ఎలాంటి అగౌరవం చూపించకుండా ఆమె పాయింట్ చెప్పిన విధానాన్ని చాలామంది మెచ్చుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఇలాంటి వేధింపులకు ఇది 'సరైన సమాధానం' అని కొనియాడారు.
56
సీరత్ ఈ పోస్ట్ తో మొదలైన రచ్చ..
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సీరత్ ఈ పోస్ట్ పెట్టింది. చార్టర్డ్ ఫ్లైట్‌లో బన్నీతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. మీ పనిని, సంబంధాలను ఎంతో సులభంగా, హుందాగా, నిజాయితీగా చూసుకుంటారు. మీకు అంతులేని విజయం, మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తర్వాతే ఆ కామెంట్ వచ్చింది.
66
సీరత్ కపూర్ సినిమాలు..
కెరీర్ విషయానికొస్తే, సీరత్ కపూర్ 2024లో జియో హాట్‌స్టార్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్', 'భామాకలాపం 2', 'మానమే' చిత్రాల్లో కనిపించింది. అలాగే 'ఉషా పరిణయం' సినిమాలో 'ఘల్లు ఘల్లు' అనే స్పెషల్ సాంగ్‌లో కూడా నటించింది.