Sreeleela : శ్రీలీలా అందుకే బెస్ట్... వరుస సినిమా ఆఫర్ల వెనుకున్న సీక్రెట్ ఇదేనా? లీలమ్మ ఏం చెప్పిందంటే..

Published : Jan 21, 2024, 04:52 PM ISTUpdated : Jan 21, 2024, 04:55 PM IST

టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీలా Sreeleela వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఒకేసారి మూడునాలుగు సినిమాల్లో నటిస్తూ మొన్నటివరకు బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. 

PREV
16
Sreeleela : శ్రీలీలా అందుకే బెస్ట్... వరుస సినిమా ఆఫర్ల వెనుకున్న సీక్రెట్ ఇదేనా? లీలమ్మ ఏం చెప్పిందంటే..
Sreeleela

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా శ్రీలీలా సందడి చేస్తోంది. వరస చిత్రాలకు సైన్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటూ బిజీగా ఉంది. 

26
Sreeleela

రీసెంట్ గా శ్రీలీలా సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu సరసన ‘గుంటూరు కారం’ Guntur Kaaram తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తన నటన, డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. 

36
Sreeleela

 ఈ చిత్రం మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నా... బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలా తను సెట్స్ లో ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది. 

46
Sreeleela

తన సెట్స్ లో ఉన్నప్పుడు కేవలం యాక్టివ్ మీదనే ధ్యాస ఉంచుతుందంట. అలాగే ప్రొఫెషనల్ గా స్విచ్ఛాన్, స్విచ్ఛాఫ్ మోడ్ లో ఉంటానని చెప్పుకొచ్చింది. అంటే పాత్రలో వెళ్లడం, మళ్లీ నార్మల్ స్థితికి రావడం క్షణాల్లోనే జరిగిపోతాయని వివరించింది. ఈ విషయంలో తను బెస్ట్ అని భావిస్తానంది.

56
Sreeleela

దాంతో ఒకేరోజు మూడు సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఉన్న క్యారెక్టర్స్ ను పండించడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోనంది. చాలా స్పష్టంగా ఉంటానని.. పాత్రలోకి ఇట్టే వెళ్లిపోతానని వెల్లడించింది. ఇక డాన్స్ విషయంలో ఏమాత్రం ఒత్తిడి ఏముండదని, బాధ్యతగా భావిస్తానని చెప్పింది. 
 

66
Sreeleela

సెట్స్ లో ఇతర విషయాల గురించి ఆలోచించనని చెప్పుకొచ్చింది. అలాగే సెట్స్ నుంచి బయటకి సినిమా గురించి ఆలోచించన చెప్పుకొచ్చింది. అలాగే చదువు విషయంలోనూ ఒక్కసారి పుస్తకం పడితే స్టూడెంట్ గా మారిపోతానని చెప్పింది. ఎక్కడ ఏది చేయాలనే స్పష్టత ఉందని’ తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఇక శ్రీలీలా లైనప్ లోని పవన్ కళ్యాణ్ Pawan Kalyan ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ కావాల్సి ఉంది.  

Read more Photos on
click me!

Recommended Stories