బేబీ బంప్ చూపిస్తూ భర్తతో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

First Published | Jan 21, 2024, 4:04 PM IST

డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి.

డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. దీనితో అమలాపాల్ వెండి తెరపై కూడా బోల్డ్ గా నటించింది.

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.    


అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

అయితే ఇటీవల అమలాపాల్ రెండు నెలల క్రితం జగత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండు నెలలకే అమలాపాల్ తన ప్రెగ్నన్సీ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 

దీనితో అనేక రూమర్స్ మొదలయ్యాయి. అమలాపాల్ గర్భవతి అయ్యాకే వివాహం చేసుకుండా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అమలాపాల్, జగత్ దంపతులు త్వరలో తల్లి దండ్రులు కాబోతున్నారు. 

అమలాపాల్ గర్భవతి అయినప్పటికీ ఆమెలో జోష్ తగ్గలేదు. భర్తతో రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తూ, లిప్ కిస్ లతో హంగామా చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అమలాపాల్ బీచ్ లో బేబీ బంప్ తో కనిపిస్తూనే హంగామా చేస్తోంది. కళ్ళు చెదిరేవిధంగా గ్లామర్ లుక్ లో రెచ్చిపోతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!