Sebastian Movie Review: సెబాస్టియన్‌ రివ్యూ.. రేటింగ్‌

First Published | Mar 4, 2022, 7:33 AM IST

 `సెబాస్టియన్‌` చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. పైగా కిరణ్‌ అబ్బవరం సినిమా అనడంతో కొన్ని అంచనాలున్నాయి. మరి శుక్రవారం విడుదలైన ఈచిత్రంతో కిరణ్‌ అబ్బరం హ్యాట్రిక్‌ కొట్టాడా?  సినిమా ఎలా ఉందనేది `రివ్యూ`లో తెలుసుకుందాం. 

`రాజావారు రాణిగారు`, `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్నాడు కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram). హీరోగా ఇండస్ట్రీలో తన మార్క్‌ని చాటుకున్నారు. తనకు ఇక తిరుగులేదనిపించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన్నుంచి వచ్చిన మరో చిత్రం `సెబాస్టియన్‌`. కామెడీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఆయన చేసిన వెరైటీ ప్రయత్నమిది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. కిరణ్‌ అబ్బవరంకి జోడీగా నువేక్ష కథానాయికగా నటించింది. కోమలి ప్రసాద్‌ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. పైగా కిరణ్‌ అబ్బవరం సినిమా అనడంతో కొన్ని అంచనాలున్నాయి. మరి శుక్రవారం విడుదలైన ఈచిత్రంతో కిరణ్‌ అబ్బరం హ్యాట్రిక్‌ కొట్టాడా?  సినిమా ఎలా ఉందనేది `రివ్యూ`లో తెలుసుకుందాం. Sebastian Movie Review

కథః 
సెబాస్టియ‌న్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం) చిన్నప్పటి నుంచి రే చీకటితో బాధపడుతుంటాడు. ఈ లోపాన్ని అధిగమిస్తూ, ఆ విషయాన్ని దాస్తూ ఎట్టకేలకు ఆయన తండ్రి కోరిక, తల్లి కల అయిన కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. అమ్మ (రోహిణి) ఇచ్చిన స్ఫూర్తితో కానిస్టేబుల్ ముందుగా సాగుతుంటాడు. రే చీకటి కారణంగా నైట్‌ డ్యూటీ సరిగా చేయలేకపోవడంతో అనేక సార్లు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతూ.. అవుతూ చివ‌రికి త‌న సొంత ఊరు మ‌ద‌న ప‌ల్లికి ట్రాన్స్ ఫర్‌ అవుతాడు. ఆ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌.ఐ (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) ని కాకా ప‌ట్టి కేవ‌లం ప‌గ‌టి పూట షిఫ్టులే వేయించుకుంటాడు. తీరా ఓరోజు నైట్ డ్యూటీ చేయాల్సి వ‌స్తుంది. ఆ రోజే పట్టణంలో ఓ వివాహిత హ‌త్య జ‌రుగుతుంది. దీని కారణంగా సస్పెండ్‌ అవుతాడు. ఆ మహిళ హత్యకి సెబాస్టియన్‌ ప్రియురాలికి, అతని స్నేహితుడికి, ఓ డాక్టర్‌కి ఉన్న సంబంధం ఏంటి? కర్తవ్యం కంటే న్యాయం గొప్పదని అమ్మ చెప్పిన మాటల స్ఫూర్తితో సెబాస్టియన్‌ ఆ వివాహిత హత్యకి కారణమైన దోషిని ఎలా పట్టుకున్నాడు? నమ్మిన వారే సెబాస్టియన్‌ని ఎలా మోసం చేశారు? సెబాస్టియన్‌ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన నిజాలేంటి? అనేది మిగిలిన కథ. Sebastian Movie Review


విశ్లేషణః 
క్రైమ్‌ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌, మర్డర్‌ మిస్టరీ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు ఇప్పుడు ఆదరణ పెరిగింది. ఇన్వెస్టిగేషన్‌ చేసే క్రమంలో చోటు చేసుకునే డ్రామా, సస్పెన్స్, ట్విస్ట్ లు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తూ, వారిని థ్రిల్‌కి ఫీల్‌ చేస్తున్న సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. ఆడియెన్స్ సైతం వాటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. `సెబాస్టియన్‌` చిత్రం కూడా ఫన్‌ మేళవించిన మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌. ఇంకా చెప్పాలంటే ఇదొక రే చీకటితో బాధపడే కానిస్టేబుల్‌ కథ. అయితే దీనికి రెగ్యూలర్‌ మర్డర్‌ మిస్టరీని జోడించారు దర్శకుడు బాలాజీ. హీరో రేచీకటి కారణంగానే ఓ అమాయకురాలైన మహిళ హత్యకు గురైందని ఈ సినిమా ద్వారా చూపించారు. అదే తప్ప ఈ కథలో కొత్తదనం లేదు. Sebastian Movie Review

సినిమాలో ప్రధానంగా లోపించింది స్క్రీన్‌ప్లే. ఫన్‌ బేస్డ్ క్రైమ్‌ థ్రిల్లర్‌ని చాలా నీట్‌గా, ఎలాంటి అడ్డంకులు లేకుండా రాసుకోవాలి. అప్పుడే ఆడియెన్స్‌కి అర్థమవుతుంది. లేదంటే అయోమయంలో పడతారు. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. మర్డర్‌ మిస్టరీ అనే చిన్న పాయింట్‌ని రెండున్నర గంటలపాటు లాగే ప్రయత్నంలో కథని ఎలా నడిపించాలో తెలియక తడబడ్డాడు దర్శకుడు. ఇలాంటి సినిమాలో ట్విస్ట్ లు ముఖ్యం. కానీ అవి ఒక్క చోట కూడా వర్కౌట్‌ కాలేదు. ఆడియెన్స్ కి ఆ థ్రిల్‌ని పంచలేక తేలిపోయాయి. మరోవైపు ఫస్టాఫ్‌ మొత్తం రే చీకటిని మ్యారేజ్‌ చేసే క్రమంలో సెబాస్టియన్‌ పడే ఇబ్బందుల్లో కామెడీకి స్కోప్‌ ఉంది. కానీ ఫన్‌ జనరేట్‌ కాలేదు. ఒకటి రెండు చోట్ల తప్ప అంతా చప్పగా సాగుతుంది. Sebastian Movie Review

సినిమాలో చాలా చోట్ల లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. అసలు రే చీకటి వ్యక్తికి పోలీస్‌ ఉద్యోగం ఎలా వచ్చిందనేది ఓ ఎత్తైతే, మర్దర్‌ కారణంగా పోయిన జాబ్‌ ఎలా వచ్చిందనేది మరో లాజిక్‌ లెస్‌. అంతేకాదు మర్డర్‌ మిస్టరీని చేధించే క్రమంలో హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌ ఫ్లో తప్పింది. దోషిని పట్టుకోవడానికి రెండేళ్లు ఎందుకు పట్టిందనేది క్లారిటీగా చూపించలేకపోయాడు. దీంతో ఆడియెన్స్ కి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసింది. ఏం జరుగుతుందో అర్థంకానీ పరిస్థితిని క్రియేట్‌ చేసింది. అంతేకాదు వివాహితని హత్యచేసేందుకు హీరో లవర్‌, హీరో ఫ్రెండ్‌, ఓ డాక్టర్‌ ప్రయత్నిస్తున్నారనే విషయం ముందే రివీల్‌ చేయడం కూడా థ్రిల్లింగ్‌ పాయింట్‌ మిస్‌ అవుతుంది. కథలో సీరియస్‌గా సాగుతున్న సమయంలో హీరోయిన్‌కి హీరో ముద్దు పెట్టే సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్లు చూపించడం సింక్‌ కాలేదు. మొత్తంగా ఫస్టాఫ్‌ కాస్తో కూస్తో ఫన్‌తో టైమ్‌ పాస్‌గా సాగినా, సెకండాఫ్‌ మాత్రం గందరగోళం క్రియేట్‌ చేసింది. బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. 
 

నటీనటులుః 
సెబాస్టియన్‌గా కిరణ్‌ అబ్బవరం నటన బాగుంది. రేచీకటి ఇబ్బందిని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. కానీ నటుడిగా ఇంకా అతను ఓపెన్‌ కావాల్సి ఉంది. సినిమాలో చాలా చోట్ల ఎలివేషన్‌ సీన్లకి ఛాన్స్‌ ఉన్నా హీరో డైలాగ్‌ డెలివరీ డల్‌ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. మరోవైపు హీరోయిన్‌ నువేక్ష తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. కోమలి ప్రసాద్‌ సైతం ఫర్వాలేదనిపిస్తుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ అదగొట్టారు. తోటి కానిస్టేబుల్‌, హీరో ఫ్రెండ్‌ ఉన్నంతలో మెప్పించారు. రోహిణి తనదైన స్టయిల్‌లో ఎమోషన్‌ పాత్రలో మెప్పించారు. కానీ ఆమె వచ్చే సన్నివేశాలు లాగ్‌ గా అనిపించి బోర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. మిగిలిన ఆర్టిస్ట్ లు ఓకే అనిపించుకున్నారు. 

టెక్నీషియన్లు ః
దర్శకుడు బాలాజీ అనుభవ లేమీ సినిమాలో కనిపిస్తుంది. సినిమా స్క్రీన్‌ప్లే ని క్లారిటీగా రాసుకోవడంలో ఏర్పడ్డ తడబాటు తెరపై కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కామెడీకి స్కోప్‌ ఉన్నా, దానిపై వర్కౌట్‌ చేయలేదనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌ అంశాలను ఇంకాస్త ఆసక్తికరంగా డిజైన్‌ చేసుకోవాల్సింది. డైలాగ్‌లు చాలా శక్తివంతంగా ఉన్నాయి. కానీ కథలో, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో అవి తేలిపోయాయి. దీంతో ఓ మంచి ఫన్‌ మర్డర్‌ మిస్టరీని మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. కాకపోతే ఎమోషన్స్ కి మించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఉండటంతో రెండింటికి గ్యాప్‌ వచ్చింది. రాజ్‌ కె నల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాతలు సిద్దారెడ్డి, జయచంద్రరెడ్డి నిర్మాణం పరంగా రాజీపడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

Sebastian Movie Review

ఫైనల్‌గాః కిరణ్‌ అబ్బవరం నటించిన `సెబాస్టియన్‌` మూవీ ఆడియెన్స్ ని ఓపికని పరీక్షించే చిత్రంగా నిలిచిందని చెప్పొచ్చు.

రేటింగ్‌ః 2.25

Latest Videos

click me!