యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. మహానుభావుడు చిత్రం తర్వాత ఆయనకు మరలా సక్సెస్ దక్కలేదు. వరుస పరాజయాలతో డీలాపడ్డ శర్వాకు ఖచ్చితంగా ఓ హిట్ అవసరం. అనేక ప్రయోగాలు చేసిన శర్వానంద్ ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం నేడు థియేటర్స్ లో దిగింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కుష్బూ, రాధిక, ఊర్వశి వంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు భారీ క్యాస్టింగ్ నటించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీమియర్ షో టాక్(Aadavallu Meeku Joharlu review) ఎలా ఉందో? శర్వానంద్ కి హిట్ దక్కిందా? ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఎలా స్పందిస్తున్నారో చూద్దాం...
27
కథ విషయానికి వస్తే కుటుంబంలోని ఆడవాళ్ళ కారణంగా చిరు(శర్వానంద్) ఏజ్ బార్ బ్యాచిలర్ అయిపోతాడు. అతడికి సంబంధాలు చూసే క్రమంలో ఆద్య(రష్మిక మందాన) పరిచయం అవుతుంది. ఆద్యను చేసుకోవాలని చిరు ఫిక్స్ అవుతాడు. అయితే ఆద్య తల్లి వకుళ(కుష్బూ)కు పెళ్లి అంటే పడదు. ఆద్య దక్కాలంటే వకుళను ఒప్పించాల్సిన పరిస్థితి. ఇక కోరుకున్న అమ్మాయిని చిరు ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ..
37
నేను శైలజ తో హిట్ కొట్టిన కిషోర్ తిరుమల ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్ చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే ఆయనకు క్లీన్ హిట్ దక్కడం లేదు. పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో విఫలం చెందుతున్నాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం కూడా అలాంటిదే.
47
రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ జోడించి ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం తెరకెక్కించారు. కథ, సన్నివేశాలు ప్రేక్షకుడికి ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. మలుపులు లేకుండా సాగిపోయే ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం కొత్త అనుభూతుని పంచడంలో విఫలమైంది.
57
అయితే చాలా వరకు సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. మరీ నిరాశ పరచకుండా అలా అని సూపర్ అనే ఫీల్ కలగకుండా మెల్లగా సాగిపోతూ ఉంటుంది. మెరుగైన స్క్రీన్ ప్లే, ఆకర్షణీయమైన ముగింపు ఉంటే సినిమా ఫలితం వేరుగా ఉండేది.
67
శర్వానంద్ నటన, రష్మిక (Rashamika Mandanna)గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అందరి నటులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్ పట్ల ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ కి యావరేజ్ మార్కులు వేస్తున్నారు.
77
మెజారిటీ ఆడియన్స్ ఆడవాళ్లు మీకు జోహార్లు జస్ట్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయగల టైం పాస్ మూవీ అంటున్నారు. ఊహించినంత ఎంటర్టైన్మెంట్ ఉండనప్పటికీ బోర్ కొట్టే చిత్రమైతే కాదు. అంచనాలు లేకుండా వెళితే ఇంకా మంచి భావన కలిగే అవకాశం కలదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే అని చెప్పాలి. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు. చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో తెరకెక్కిన ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ఓసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.