తనకంటే 16 ఏళ్ళు పెద్ద హీరోని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

First Published | Nov 8, 2024, 6:12 PM IST

క్యూట్ బుజ్జిగా ఉన్న ఈ పాపను చూశారా..? ఈమె ఓ హీరోయిన్. కోటీశ్వరురాలు, ఎంతో ప్రేమతో సినిమాల్లోకి వచ్చి.. తనకంటే 16 ఏళ్లు పెద్ద హీరోను పెళ్ళాడి సినిమాలు కూడా త్యాగం చేసింది. ఇంతకీ ఎవరామె. 

సయీషా

సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరోయిన్‌కీ మొదటి సినిమాలోనే మంచి డైరెక్టర్, హీరోతో నటించే అవకాశం రాదు. కానీ  మొదటి సినిమాలోనే అలాంటి అవకాశం దక్కించుకున్న హీరోయిన్ సయీషా సైగల్. ఈమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:  హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త

సయీషా

ముంబైలో పుట్టి పెరిగిన సయీషా ప్రముఖ నిర్మాత, నటుడు సుమీత్ సైగల్ కూతురు. ఈమె నానమ్మ నసీర్ బాను 1930, 1950 మధ్యకాలంలో హిందీ సినిమాల్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌ని ఊపేసింది.

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, నటి సైరా బాను, నటి ఫరా ఈమెకు దగ్గరి బంధువులు. పెద్ద సినీ నేపథ్యం ఉన్నా, బాలీవుడ్‌లో  సహజమే అయినా, సొంత ప్రతిభతో దక్షిణాది సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంది సయీషా.

Also Read:  దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?


సయీషా, ఆర్య పెళ్లి

2005లో సూర్యా నటించిన, ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన 'గజినీ'లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఒక్కో సినిమాలో నటించింది. తమిళంలో మాత్రం ఆరు సినిమాల్లో నటించింది.

సయీషా డ్యాన్స్ చూసి ముగ్ధుడైన దర్శకుడు ఏ.ఎల్.విజయ్, తన 'వనమగన్' సినిమాలో జయం రవికి జోడీగా నటించే అవకాశం ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సయీషా, ఆ తర్వాత కార్తితో 'కడైకుట్టి సింగం', విజయ్ సేతుపతితో 'జుంగా' సినిమాల్లో నటించింది.

Also Read:  మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్, త్వరలో ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

సయీషా, ఆర్య ప్రేమ

ఆర్యతో 'గజినీకాంత్' సినిమాలో నటిస్తున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఆర్యతో 'కాప్పాన్', 'టెడ్డీ' సినిమాల్లో నటించింది. తల్లిదండ్రుల అనుమతితో 2019 మార్చిలో ఆర్య, సయీషా పెళ్లి చేసుకున్నారు. అయితే  సాయిషా కంటే ఆర్య 16 ఏళ్లు పెద్దవాడు. 

సయీషా

హైదరాబాద్‌లో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వచ్చి వీళ్ళని ఆశీర్వదించారు. పెళ్లికి ముందు ఒప్పుకున్న కొన్ని సినిమాలు పూర్తి చేసిన సయీషా, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.

తన కుటుంబం కోసం ఆమె సినిమాలు త్యాగం చేసింది.  కానీ గతేడాది సింబు, గౌతమ్ కార్తీక్ నటించిన 'పత్తు తల' సినిమాలో 'రౌడీ' అనే ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది.
 

సయీషా కుటుంబ ఫోటో

ఆర్య, సయీషా దంపతులకు అందమైన కూతురు ఉంది. ఆర్య పెళ్లికి ముందు నుంచే కాంట్రవర్సీలకు పేరున్న వ్యక్తి. కొంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి. 'ఎంగ వీట్టు మాప్పిళ్ళై' అనే షో ద్వారా ఆర్యని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు పోటీ పడ్డారు. కానీ చివరికి తనకన్నా 16 ఏళ్ళు చిన్నదైన సయీషాని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు ఆర్య.

Latest Videos

click me!