దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?

First Published | Nov 8, 2024, 5:13 PM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎంతో మంది నటీనటులు చావులు మిస్టరీలుగా మిగిలిపోయాయి. అందులో దివ్య భారతి చావు కూడా అంతే మిగిలిపోయింది. ఇంతకీ ఆమె మరణాలనికి కారణం ఏంటి..? 

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది నటీనటుల మరణాలు తలుచుకుంటే.. ఇప్పటికీ మనసు బరువుతో నిండిపోతుంటుంది. అటువంటివారిలో మహానటి సావిత్రి, దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత, సుశాంత్ సింగ్ రాజ్ పుత్  లాంటివారిని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే వీరి మరణాలలో సుశాంత్, దివ్య భారతి మరణాలు ఇప్పటికీ మిస్టరీలగానే ఉన్నాయి. 

Also Read: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్, త్వరలో ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

మరీ ముఖ్యంగా బిల్టీంగ్ మీదనుంచి పడిపోయిన  దివగంత నటి దివ్య భారతి మరణం అనుమానస్పదమే. ఆ విషయం ఇప్పటీకీ అభిమానుల మనసులో చెరగని చేదు నిజం. యావత్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఆమె ఆకస్మిక మృతి కలకలం సృష్టించింది. చాలా చిన్న వయస్సలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టంది దివ్య భారతి. 

16 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా మారిన ఆమె.. 18 ఏళ్లకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. అంతే కాదు బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా ఆమె రెండు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. వెంకటేష్, మెహన్ బాబు సినిమాల్లో నటించింది దివ్య భారతి. 16 ఏళ్లకు ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె జీవితం 19 ఏళ్ళకే ముగిసిపోయింది. 

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?


ఈలోపే ఆమెకు పెళ్లి కూడా జరిగింది.  ఇక దివ్యభారతి మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ. దివ్య భారతి మృతి గురించి ఎవరికి తోచింది వారు చెపుతుంటారు. కాని అందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు పోలీసులు కూడా ఏం తేల్చలేక వదిలేశారు.

ఇక రెండు దశాబ్దాలు అవుతున్నా.. దివ్య భారతిమరణం గురించి రోజు ఏదో ఒక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు బాల్కనీ నుంచి పడి దివ్యభారతి మరణించగా..

ఆ సమయంలో ఆమె భర్త నిర్మాత సాజిద్ నడియాద్వాలాపై పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే సాజిత్ నిందితుడు కాదని బాలీవుడ్ నటి గుడ్డి మారుతి సంచలన విషయాలను బయటపెట్టింది.

ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?

బాలీవుడ్ నటి గుడ్డి మారుతి రీసెంట్ గా ఓ  ఇంటర్వ్యూలో పాల్గొంది.  ఈసందర్భంగా  గుడ్డి మారుతి మాట్లాడుతూ.. దివ్య మంచి అమ్మాయి. కానీ ఎప్పుడూ విశ్రాంతి అనేది లేకుండా పనిచేసేది. కాని అంతే ఎక్కువగా ఎంజాయ్ చేసేది.

ఎంతలా ఉండేదంటే ప్రతీ రోజు అదే  తన జీవితంలో చివరి రోజు అన్నట్టుగా గడిపేది.షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ టైమ్ లో ఆమె మరణం జరిగింది.   ఏప్రిల్ 5న దివ్య మరణించింది అంతకు ముందు రోజు అంటే  ఏప్రిల్ 4న నా పుట్టినరోజు.

ఆరోజు మేము పార్టీ చేసుకున్నాము. గోవింద, దివ్య , సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు. కాని ఆ పార్టిలో  దివ్య భారతి చాలా డల్ గా కనిపించింది. ఎందుకో తెలియదు అందరితో మాట్లాడుతుంది కాని.. లోలోపల ఏవిషయం గురించో  బాధపడుతుందని భావించాను. 

ఉదయాన్నే ఔడోర్ షూటింగ్ ఉంది.. కాని ఆ  షూటింగ్ కి  వెళ్ళడం ఆమెకు  ఇష్టం లేదు. కాని వెళ్ళాల్సిందే అని అనుకుంది. ఇక  దివ్యభారతి తన ఫ్యామిలీతో  ఐదో అంతస్తులో ఉండేవారు. ఆ రాత్రి నేను ఐస్ క్రీం  తీసుకోవడానికి నేను కిందకి వెళ్లాను. అప్పుడు నన్ను పై నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెళ్లి చూసే సరికి దివ్య బాల్కనీలో కూర్చుని కనిపించింది. 
 

ఇక్కడ కూర్చోవడం మంచింది కాదు ప్రమాదం అని  చెప్పాను. కానీ నాకు ఎత్తైన స్థలాలు అంటే భయం లేదని.. తనకు ఏం కాదని నాతో చెప్పింది. సాజిద్ కారు వచ్చిందో లేదో చేసేందుకు దివ్య కిందకు వంగి చూసింది.. అప్పుడు అనుకోకుండా కాలు జారి ఆమె కిందపడి చనిపోయింది.

డిజైనర్ నీతా లుల్లా కూడా ఆ ఘటన చూసింది. దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది. సాజిద్‌ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గుడ్డి మారుతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
 

Latest Videos

click me!