ప్రభాస్ & హోంబలే: రూ.1000 కోట్ల డీల్?

First Published | Nov 8, 2024, 5:37 PM IST

హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ తో వరసగా మూడు సినిమాలు నిర్మించనుంది. ఈ మూడు సినిమాలకు ప్రభాస్ కి దాదాపు వెయ్యి కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Rebel Star, Prabhas, Hombale Films


ప్రభాస్ వంటి ఫ్యాన్ ఇండియా స్టార్ తో సినిమా చేయాలని ప్రతీ ప్రొడక్షన్ హౌస్ కు ఉంటుంది. కానీ ఆ అవకాసం కొందరికే వస్తుంది. అలాంటి అద్బుతమైన ఛాన్స్ హోంబలే ప్రొడక్షన్ హౌస్ కొట్టేసింది. వరస పెట్టి మూడు సినిమాలుకు ప్రభాస్ ని ఒప్పించి ఆయన చేత సైన్ చేయించింది.

దాంతో ఇప్పుడు తెలుగు,కన్నడంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా హోంబలే అవతరించనుంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. ఏ డైరక్టర్స్ ఆ మూడు సినిమాలు చేయనున్నారు వంటి విషయాలు చూద్దాం. 

Rebel Star, Prabhas, Hombale Films


ప్రారంభం నుంచి వైవిధ్యమైన  కథలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయాలనే లక్ష్యంతో విజయ్‌ కిరంగదూర్‌ ‘హోంబలే ఫిల్మ్స్‌’ నిర్మాణ సంస్థను స్థాపించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘నిన్నిందలే’తో నిర్మాణ రంగంలో విజయ్‌ ప్రయాణం మొదలైంది.

2018లో విడుదలైన ‘కేజీయఫ్’ ఈ సంస్థకు గుర్తింపు తెచ్చిపెట్టింది. దీని తర్వాత ‘కాంతార’, ‘సలార్‌ సీజ్‌ ఫైర్‌’ వంటి చిత్రాలు ఈ బ్యానర్‌లో నిర్మితమై ఘన విజయాన్ని అందుకున్నాయి. 


Rebel Star, Prabhas, Hombale Films


‘కేజీయఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ చిత్రాలను నిర్మించిన సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తాజాగా ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రభాస్‌తో మూడు సినిమాలు చేయనున్నట్లు ప్రకటించింది.

భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని తెలిపింది. అంతేకాకుండా, మునుపెన్నడూ చూడని సినిమాటిక్‌ అనుభూతిని అందించనున్నట్లు ప్రకటించింది.
 

Rebel Star, Prabhas, Hombale Films


‘‘భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా మూడు చిత్రాల భాగస్వామ్యంలో ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది.

ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించాలనే మా నిబద్ధతకు సంబంధించిన ప్రకటన ఇది. వేదిక సిద్ధమైంది. ముందుకుసాగే మార్గం అపరిమితంగా ఉంటుంది. #Salaar2 తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి’’ అని తెలిపింది.  
 

Rebel Star, Prabhas, Hombale Films


‘ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్‌’ అని పేర్కొంది. 2026, 2027, 2028ల్లో ఈ చిత్రాలు ఉండనున్నట్లు చెప్పింది. ‘సలార్‌ 2’ మినహాయించి మిగిలిన ప్రాజెక్టులు ఏమిటనే విషయాన్ని నిర్మాణ సంస్థ తెలియజేయలేదు. మరోవైపు, ఈ విషయంపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 గతేడాది రిలీజ్ అయిన ‘సలార్‌’ కోసం ప్రభాస్‌ తొలిసారి ఈ నిర్మాణసంస్థతో కలిసి వర్క్‌ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంది. దీనికి కొనసాగింపుగా ‘సలార్‌ శౌర్యంగపర్వం’ తెరకెక్కనుంది.  


ఇక ప్రభాస్ ఈ మూడు సినిమాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారనే విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఈ మూడు సినిమాల నిమిత్తం దాదాపు వెయ్యి కోట్లు ప్యాకేజీగా ప్రభాస్ కు అందించనున్నారు.

అయితే మూడు సినిమాలకు ఒకటే రెమ్యునరేషన్ కాదట. మొదట సినిమాకు రెట్టింపుగా రెండో సినిమాకు, రెండో సినిమాకు రెట్టింపుగా మూడో సినిమాకు ఇవ్వబోతున్నారని మొత్తం కలిపితే వెయ్యి కోట్లు అని తెలుస్తోంది. ఎందుకంటే రెమ్యునేషన్ ప్రభాస్ ది ఎప్పటికప్పుడు పెరుగుతూ  ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని లెక్కేసి ఇవ్వబోతున్నారట. అడ్వాన్స్ గా రెండు వందల కోట్లు దాకా పే చెయ్యబోతున్నారట.

hombale films announced 3 film contract with prabhas


అలాగే ఈ మూడు సినిమాలకు డైరక్టర్స్ ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ ఫైనల్ అయ్యారట. మూడో డైరక్టర్ ఎవరనేది తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే ప్రభాస్ ద్వారా ఈ సంస్దను ఆదిపురుష్ దర్శకుడు ఓం రావత్ ...ఓ పీరియడ్ కథతో ఎప్రోచ్ అయ్యారట.

ఫైనల్ అయ్యిందో లేదో తెలియాల్సి ఉంది. ఇంకా టైమ్ ఉంది కాబట్టి ప్రస్తుతం డైరక్టర్స్ తమ కథలను పూర్తిగా స్క్రిప్టు రూపంలో రెడీ చేసుకుంటున్నారు. మూడు సినిమాలు మూడు వైవిధ్యమైన కథలు అంటున్నారు. 

Latest Videos

click me!