సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె చివరగా నటించిన సూపర్ హిట్ మూవీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఆ చిత్రంలోని హీరో కూడా ప్రమాదంలోనే మరణించారు.
దివంగత నటి సౌందర్య సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా చాలా కాలం వెలుగు వెలిగారు. 2004లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత విషాదకర సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటి. హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్న టైంలో సౌందర్య మరణించారు.
25
సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ
సౌందర్య నటించిన చివరి చిత్రం శివ శంకర్. కానీ ఆమెకి చివరగా ఘనవిజయాన్ని అందించిన చిత్రం మాత్రం సీతయ్య. నందమూరి హరికృష్ణకి జోడీగా ఈ మూవీలో సౌందర్య నటించారు. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వైవిఎస్ చౌదరి ఈ చిత్రం పవర్ ఫుల్ గా తెరకెక్కించారు.
35
ఏడాదిలోపే మరణం
ఈ మూవీలో సౌందర్యతో పాటు సిమ్రాన్ కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 2003 లో విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ మూవీ విడుదలైన ఏడాది లోపే సౌందర్య హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించారు.
ఈ చిత్రంలో నటించడం తనకు ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అని సౌందర్య అప్పట్లో తెలిపారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక మీడియాతో మాట్లాడారు. ఈ మూవీలో నేను పోషించింది డైనమిక్ రోల్. ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా వెళ్లే అమ్మాయిగా నటించాను. నా పాత్ర చాలా బాగా నచ్చింది అని సౌందర్య పేర్కొన్నారు. మీ క్యారెక్టర్ ని రియల్ లైఫ్ తో పోల్చగలరా అని ప్రశ్నించగా.. సినిమాల్లో చూపించేవి ఏవీ రియల్ లైఫ్ లో జరగవు. రియల్ లైఫ్ లో జరగని అంశాలని వెండితెరపై చూసి మైమరపోవాలని ఆడియన్స్ కోరుకుంటారు. అందుకే సినిమాని ఫాంటసీ, మ్యాజిక్ అని అంటారు. సినిమాలో జరిగేది ఏదీ నిజం ఉండదు. సినిమాలో చేసినట్లు బయట చేస్తే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అని సౌందర్య పేర్కొన్నారు.
55
టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంఘటనలు
ఈ మూవీలో సౌందర్య, హరికృష్ణ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దురదృష్టం ఏంటంటే హరికృష్ణ కూడా ప్రమాదంలోనే మరణించారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ 2018లో మరణించిన సంగతి తెలిసిందే. ఒకే సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు వేర్వేరు ప్రమాదాల్లో మరణించి టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేశారు.