సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్‌ సాంగ్‌ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది

Savitri: మహానటి సావిత్రి.. అద్భుతమైన నటిగా సౌత్‌ సినిమాని ఓ ఊపు ఊపేసింది. కానీ జీవితంలో కొన్ని చేసిన తప్పుల కారణంగా ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది. 
 

Savitri done only one item song do you know which ? her life turn with that in telugu arj
Savitri

సావిత్రి.. మహానటి అనే పదానికి ప్రతి రూపం. ఆమె వెండితెరపై చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. స్టార్‌ హీరోలను మించిన ఇమేజ్‌తో రాణించింది. సౌత్‌ సినిమాని తనవైపు తిప్పుకుంది. అలాంటి సావిత్రి ఓ ఐటెమ్‌ సాంగ్‌లో నటించింది. మరి ఆ పాట ఏంటి? అది ఏ సినిమాలోనిది అనేది చూస్తే.. 

Savitri done only one item song do you know which ? her life turn with that in telugu arj
Savitri

సావిత్రి నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. చాలా మంది సినిమాల్లో ప్రయత్నించమని చెప్పగా, మద్రాస్‌(చెన్నై)కి వెళ్లి ప్రయత్నాలు చేశారు. 1949లో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ చిన్న పిల్లగా ఉందని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత `సంసారం` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. 


pathala bhairavi

అప్పటికీ సావిత్రికి పెద్దగా గుర్తింపులేదు. అదే సమయంలో `పాతాళ భైరవి`లో డాన్స్ చేసే అవకాశం ఉందని తెలిసి ఆడిషన్‌కి వెళ్లింది. సరదాగా వెళ్లి ఆఫర్‌ కొట్టింది. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌, మాలతి కలిసి నటించిన మూవీ ఇది. కెవి రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నర్తకిగా నటించింది సావిత్రి. 
 

pathala bhairavi

అప్పట్లో నర్తకి అంటే ఇప్పుడు ఐటెమ్‌ గర్ల్ అని చెప్పొచ్చు. పార్టీలో, సభలోనే డాన్స్ చేయడం. అలా `పాతాళభైరవి`లో ఆమె నర్తకిగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా 1951లో విడుదలై సంచలన విజయం సాధించింది.  `రానంటే రానే` పాటలో డాన్స్ చేసిన సావిత్రికి మంచి పేరు వచ్చింది. 
 

Savitri

ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దీంతో సావిత్రి జాతకం మారిపోయింది. వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. `పెళ్లి చేసిచూడు` సినిమా నటిగా బ్రేక్‌ ఇచ్చింది. `దేవదాసు`తో మాత్రం ఇక స్టార్‌ అయిపోయింది. తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌తో రాణించింది. 
 

Savitri

అప్పట్లో వరుసగా మూడు షిఫ్ట్ ల్లో మూడు సినిమాలు చేసేదంటే అతిశయోక్తి కాదు. అలా ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు దీటుగా ఎదిగింది. కానీ జీవితంలో చేసిన కొన్ని తప్పుల వల్ల తన కెరీర్‌ని నాశనం చేసుకుంది. చివరికి కోమాలోకి వెళ్లి చనిపోయిన విషయం తెలిసిందే. 

read  more: స్టార్‌ యాంకర్‌ కొంపముంచిన `బిగ్‌ బాస్‌` షో.. డిప్రెషన్‌లోకి వెళ్లానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో

also read: `ఉప్పెన` విలన్‌తో పూరీ జగన్నాథ్‌ సినిమా.. ఛార్మి స్థానంలో కొత్త ప్రొడక్షన్‌, క్రేజీ డిటెయిల్స్

Latest Videos

vuukle one pixel image
click me!