Devatha: అందరి ముందు దేవిని తిట్టిన సత్య... రాధని క్షమాపణ కోరిన జానకమ్మ!

First Published Sep 17, 2022, 10:58 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య, దేవి కోసం కేక్ తెచ్చి కేక్ కట్ చేపిస్తాడు. కేక్ చాలా అమ్మ ఇంకా చాక్లెట్లు ఏమైనా తెమ్మంటావా, వచ్చేసారి ఇంకా మంచి బెల్ట్ సంపాదించాలి అని అంటాడు ఆదిత్య. అప్పుడు సత్య మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా ఆదిత్య ఇప్పటికైనా బయలుదేరుదాం అని అనగా, దేవికి ఇప్పుడు బెల్టు వచ్చింది కదా బయటకి వెళ్లి తినడం కన్నా అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాము.నువ్వు ఏం తెప్పించాలనుకుంటున్నావో తెప్పించు అని అనగా సత్య కోప్పడి అసలు నువ్వు ఏం చేస్తున్నావని తెలుస్తుందా ఆదిత్య.
 

 ఇంక నీకు జన్మలో నామీద ప్రేమ తిరిగి రాదు. ఎప్పుడు మనిద్దరం కలిసి గడుపుదాం అన్నావ్ దేవి మధ్యలో వస్తుంది. ఎప్పుడు తనే నీ నుంచి నన్ను వేరు చేస్తాది. నాకన్నా నీకు తనే ఎక్కువ ఇష్టం, ఎప్పుడు చూడు దాని వెనుకనే తిరుగుతావు, దాంతోనే మాట్లాడుతావు. ఎవరైనా నీకు మళ్ళీ వచ్చి చెప్పి మంచిదారిలో పెడితే అప్పుడు నా దగ్గరికి వస్తావు. మళ్ళి దేవి మొహం కనిపించగాని కథ మళ్ళీ మొదటికి వస్తుంది.  పరాయి అమ్మాయి మీద నీకు ఎందుకు అంత ప్రేమ నాకు అర్థం కాదు అని అరుస్తుంది.
 

 అప్పుడు ఆదిత్య,నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా సత్య. దేవి ముందు ఎందుకు అలా అనడం అని అనగా కమల, సత్య అన్న దాంట్లో తప్పేం లేదు కదా పటేలా. ఉన్న మాటే కదా అన్నది. నిజంగానే నువ్వు ఈ మధ్య సత్యకి విలువ ఇవ్వడం లేదు అని అనగా సత్య,ఇంక అర్థం చేసుకోవడు అక్క,ఎంత చెప్పినా ఇంకా అర్థం చేసుకోడు. దేవి కావాలి అంటాడు. అసలు ఆ దేవి అనేది లేకపోతే ఎంత హాయిగా ఉండేది అని సత్య కోప్పడి నుంచి వెళ్ళిపోతుంది. దేవి ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఉంటుంది.
 

 ఆ తర్వాత సీన్లో రుక్మిణి వంటగదిలో ఉన్నప్పుడు జానకమ్మ అక్కడికి వెళ్లి, నన్ను క్షమించమ్మా ఇన్నాళ్లు నువ్వేదో బాధలో ఉన్నావు అని అనుకున్నాను తప్ప, ఆ బాధకి కారణం నా కొడుకే  అని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే నాకు విషయం అర్థం అవుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్తాను అన్నావు కదా అమ్మ వెళ్ళిపో. నేను ఏమీ అడ్డు చెప్పను కానీ చిన్మయికి అన్యాయం చేయొద్దమ్మా, చిన్మయికి నువ్వే తనకు కన్నతల్లి అనుకొంది.నీ మీద అసలు పెట్టుకున్నది నానమ్మగా నా స్వార్థం నాకు ఉంటుంది కదా.
 

అయినా సరే నీకు ఇష్టం లేదంటే నేను నిన్ను మాధవ్ లా అడ్డుపడను. ఈరోజు నుంచి నేను నీకు ఉన్నాను. తప్పు చేసిన వాడు ఎవడైనా ఆఖరికి నా కొడుకు అయినా నేను వాడిని శిక్షిస్తాను నువ్వేం భయపడొద్దు అని రాధకి ధైర్యం చెప్తుంది జానకమ్మ. ఈ మాటలన్నీ విన్న మాధవ్, బయట ఆదిత్య అనుకున్నాను,లోపల అమ్మ కూడా రాదకే సపోర్ట్ చేస్తుంది. పరిస్థితి చేయజారకముందే ఏమైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు మాధవ్. ఆ తర్వాత సీన్లో దేవి ఇంటి నుంచి బయటికి పరిగెడుతూ ఉంటుంది.
 

 అప్పుడు ఆదిత్య దేవిని ఆపి అలా కాదమ్మా సత్య పిన్నికి నీ మీద ప్రేమ ఉంది, నా మీద కోపం అని అనగా,లేదు పిన్నికి నేనంటే నచ్చలేదు అందుకే నన్ను అన్ని మాటలు అన్నది. ఇంకెప్పుడూ నేను మీ ఇంటికి రాను, నేను మీ ఇంటికి రావడం వల్ల మీ ఆనందం దూరం అవుతుంది కదా. ఇంకెప్పుడు నేను మీ ఇంటికి రాను ఇదే చివరిసారి అని అంటాది. ఇంతలో మాధవ్ అక్కడికి వస్తాడు. దేవి వెంటనే మాధవ్ దగ్గరికి వెళ్లి హద్దుకొని నాయన మనం ఇంటికి వెళ్లి పోదాము.
 

 ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని అనగా,ఎప్పుడూ నువ్వే కదా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చే దానివి ఏమైంది అని మాధవ్ అంటాడు. అప్పుడు దేవి ముందు ఇంటికి వెళ్దాం పద  అని అంటుంది.ఇంతలో సత్య వచ్చి ఒక నిమిషం ఆగండి బావగారు,మీకు నచ్చకపోయినా ఎందుకు ప్రతిసారి దేవిని మా ఇంటికి పంపిస్తున్నారు అని అడుగుతుంది.నేను పంపించడం లేదమ్మా,ఇదిగో ఈయన గారే వచ్చి తీసుకువెళ్తారు,నేను వొద్దు అంటే రాధ బాధపడుతుంది అని అంతాడు మాధవ్. ముందే చెప్తున్నాను బావగారు ఇంకెప్పుడూ దేవి మా ఇంటికి రాకూడదు. ఇదే చివరిసారి అని అంటుంది సత్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!