మహేష్‌ కోసం ప్రభాస్‌ హీరోయిన్‌ని దించుతున్న రాజమౌళి.. స్కెచ్‌ మామూలుగా లేదుగా!

Published : Sep 17, 2022, 10:33 AM IST

రాజమౌళి స్కెచ్‌ వేస్తే తిరుగుండదు అంటారు. ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ఆయన ఈ విషయాన్ని నిరూపించారు. ఇప్పుడు మహేష్‌తో సినిమా కోసం ఊహించని స్కెచ్‌ వేస్తున్నారు.   

PREV
16
మహేష్‌ కోసం ప్రభాస్‌ హీరోయిన్‌ని దించుతున్న రాజమౌళి.. స్కెచ్‌ మామూలుగా లేదుగా!

ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో విజయాన్ని అందుకున్నారు రాజమౌళి. ఈ చిత్రానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలందుతున్నాయి. ఊహించిన విధంగా వెస్ట్ సైడ్‌(అమెరికా) నుంచి విశేష ప్రశంసలు, ఆదరణ దక్కుతుంది. సినిమాని ఆకాశానికి ఎత్తుతున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆస్కార్‌ బరిలో నిలవబోతుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటులు వంటి పలు కెటగిరీల్లో దీన్ని ఆస్కార్‌ బరిలో నిలపాలని భావిస్తున్నారు. 

26

`ఆర్‌ఆర్‌ఆర్‌` ఇంతటి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో రాజమౌళి ప్లాన్‌ మార్చారు. మహేష్‌తో చేయాల్సిన సినిమాకి సంబంధించిన భారీ స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. వెస్ట్‌ సైడ్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ సరికొత్త ప్లాన్‌ని అమలు చేయబోతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మహేష్‌ సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట జక్కన్న. అందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ కాస్టింగ్‌ని తీసుకోబోతున్నట్టు సమాచారం.  

36

ఇక మహేష్‌ కోసం ప్రభాస్‌ హీరోయిన్‌ని రంగంలోకి దించుతున్నారు రాజమౌళి. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనెని హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. దీపికా.. ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. అదే సమయంలో ఆమెకి ఇంటర్నేషనల్‌ మార్కెట్ కూడా ఉంది. ఆమె ఒకటి రెండు హాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. దీంతో ఆ క్రేజ్‌ మహేష్‌ సినిమాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట రాజమౌళి. 

46
Image: Varinder Chawla

అయితే ముందు అలియాభట్‌ పేరు హీరోయిన్‌గా వినిపించింది. కానీ ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. డెలివరీ అయి సెట్‌ కావడానికి టైమ్‌ పడుతుంది. అందుకే దీపికాని తీసుకునేందుకు ప్లాన్‌ జరుగుతుందట. దీపికా అయితే మహేష్‌ హైట్‌కి బాగా సెట్ అవుతుందని, జంట కూడా ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారట. 

56

అంతేకాదు ఈ చిత్రాన్ని రాజమౌళి ప్రపంచ సాహసికుడి కథతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అనేక దేశాల్లో చిత్రీకరించబోతున్నారట. అంతర్జాతీయ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లని కూడా తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. ఇదే నిజమైతే మహేష్‌ సినిమా అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా నిలబోతుందని, ఇదొక అద్భుతం కాబోతుందని, కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో ఉండబోతుందని చెప్పొచ్చు.
 

66

దీంతో ఇప్పట్నుంచి సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ పూర్తయ్యేలోపు ఆర్టిస్టులు, టెక్నీషియన్లని ఫైనల్‌ చేయబోతున్నారట. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కె.ఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories