ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను.. జానకమ్మ ఆరోగ్యం చూసుకోండి అంటూ రాధ రామ్మూర్తికి చెప్పి వెళ్ళిపోతుంది. మరో సీన్ లో దేవుడమ్మా ఆదిత్య కోసం ఎదురు చూస్తుంటుంది. రుక్మిణి మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది.. ఆదిత్య రాగానే దేవుడమ్మా ఒక్క చెంప దెబ్బ కొడుతుంది. అయ్యో ఏంటి అలా కొట్టారు అని కుటుంబసభ్యులు అడిగితే మీరు ఎవ్వరు మాట్లాడకండి నేను ఆదిత్య మాత్రమే మాట్లాడాలి అని అంటుంది.