ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. పరంధామయ్య పుట్టినరోజు జరపడానికి నందు లాస్య అనసూయ అభి ప్లాన్ చేస్తారు. కానీ మిగతా కుటుంబ సభ్యులు అంతా కూడా తులసి ఇంటికి వెళ్తారు. ఆఖరికి పుట్టినరోజు జరుపుకోవాల్సిన పరంధామయ్య కూడా తులసి ఇంటికి వెళ్తాడు. ఇక్కడేమో నందు లాస్య అనసూయ కలిసి పరంధామయ్య రూమ్ కి వెళ్లి హ్యాపీ బర్త్డే టూ యు అని అందరూ పాట పాడుతారు. అర్ధరాత్రి 12 గంటలకు అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినప్పటికీ పరంధామయ్య ఎంతటి లేవకపోవడంతో బెడ్ షీట్ తీస్తే అక్కడ దిండ్లు ఉంటాయి. అవి చూసి అందరూ షాక్ అయిపోతారు.