ప్రస్తుతం చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే కోణం ప్రేక్షకుల్లో లేదు. కథ నచ్చితే బ్రహ్మరథం పట్టేస్తున్నారు. 2022లో ఆయా చిత్రాలతో ఇది స్పష్టం అయ్యింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో ‘శాసనసభ’ ఒకటి. పొటిలికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో ఇంద్రసేన ప్రధాన పాత్రలో నటించారు. నటకిరీటీ, సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రను పోషించారు. హీరోయిన్ గా ఐశ్వర్య రాజ్ బకుని నటించింది. సోనియా అగర్వాల్, హేబా పటేల్ ఆయా రోల్స్ లో మెరిశారు. వేణు మడికంటి దర్శకత్వం వహించగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాఘవేంద్రరెడ్డి అందించారు. మ్యూజిక్ సెన్సేషన్ రవి బసూర్ సంగీతం అందించారు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించారు. డిసెంబర్ 16న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది.