పట్టలేని ఆనందంలో కాజల్.. కొడుకును చూసుకుంటూ మురిసిపోతున్న స్టార్ హీరోయిన్.. క్యూట్ పిక్స్!

Published : Dec 17, 2022, 12:51 PM ISTUpdated : Dec 17, 2022, 12:53 PM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పట్టలేని ఆనందంలో ఉంది. పెళ్లి తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ.. భర్త, కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. తాజాగా తన కొడుకు క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.  

PREV
18
పట్టలేని ఆనందంలో కాజల్.. కొడుకును చూసుకుంటూ మురిసిపోతున్న స్టార్ హీరోయిన్.. క్యూట్ పిక్స్!

స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న తరుణంలోనే కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కింది. మొదటి లాక్ డౌన్ 2020 అక్టోబర్ 30న ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో వివాహాం జరిగింది. హోమ్ టౌన్ ముంబైలోనే కుటుంబ సభ్యుల మధ్య వివాహా వేడుక ముగిసింది. 
 

28

పెళ్లైన కొన్నాళ్లకే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ప్రెగ్నెన్సీ రావడంతో సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత బేబీ బౌన్స్ ను చూపిస్తూ చాలా ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య వివరాలను అభిమానులతో పంచుకుంది. 

38

ఇక ఈ ఏడాది ఏప్రిల్ 19న 2022న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కొడుకుతో, భర్తతో కలిసి సంతోషంగా ఉంటోంది. పుట్టిన వెంటనే కొడుకు నీల్ కిచ్లు అని నామకరణం చేసింది. ఇన్నాళ్లు మీడియా కంట పడకుండా కొడుకును దాచేసిన ఈ బ్యూటీ తాజాగా క్యూట్ పిక్స్ ను షేర్ చేసింది.
 

48

వీకెండ్ సందర్భంగా భర్త గౌతమ్ కిచ్లు, కొడుకు నీల్ కిచ్లుతో కాజల్ హ్యాపీ మూమెంట్స్ ను క్రియేట్ చేసుకుంటోంది. కొడుకును చూసుకుంటూ మురిసిపోతోంది.  కొద్దికొద్దిగా ఎదుగుతున్న బిడ్డపై తల్లిప్రేమను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తోంది. కొడుకును క్షణం వీడకుండా ముద్దుగా చూసుకుంటోంది. 
 

58

ఈ మేరకు కాజల్ తాజాగా పంచుకున్న ఫొటోలకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాజల్ సంతోషంగా ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.   

68

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. ‘చందమామ’ సినిమాతో మంచి గుర్తింపు పొందిన కాజల్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో అవకాశాలను అందుకుంది. అనతికాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.
 

78

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి.. మంచి హిట్ సినిమాలను సొంతం చేసుకున్న కాజల్.. అటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. దీంతో సౌత్ తో పాటు, నార్త్ లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. లక్షలాది మంది అభిమానులను దక్కించుకుంది.

88

పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్ మళ్లీ రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాజల్ రీఎంట్రీపైనా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నారు. 


 

click me!

Recommended Stories