SVP movie: యుఎస్ ప్రీమియర్స్ తో 'సర్కారు వారి పాట' సునామీ.. అక్కడ మహేష్ ట్రాక్ రికార్డ్ ఇదిగో..

Published : May 04, 2022, 02:07 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే.

PREV
17
SVP movie: యుఎస్ ప్రీమియర్స్ తో 'సర్కారు వారి పాట' సునామీ.. అక్కడ మహేష్ ట్రాక్ రికార్డ్ ఇదిగో..
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీర్చేందుకు డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ అందించబోతున్నారు. 

27

సర్కారు వారి పాట రిలీజ్ ప్లానింగ్స్ కూడా మొదలైపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా కళ్ళు చెదిరే స్థాయిలో సర్కారు వారి పాట రిలీజ్ ఉండబోతోంది. ఓవర్సీస్ లో బలమైన మార్కెట్ ఉన్న నటులలో మహేష్ బాబు ఒకరు. మహేష్ నటించిన సినిమాలు 10 సార్లు ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని అధికమించాయి. 

37

అందులో మూడు చిత్రాలు 2 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. భరత్ అనే నేను చిత్రం 3.4 మిలియన్ డాలర్లు, శ్రీమంతుడు 2.8 మిలియన్ డాలర్లు, సరిలేరు నీకెవ్వరు 2.2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాయి. దీనితో మహేష్ బాబు ఓవర్సీస్ బాక్సాఫీస్ పై కింగ్ గా అవతరించారు. 

 

47

దూకుడు మొదలుకుని మహేష్ నటించిన అన్ని చిత్రాలు యుఎస్ లో 1 మిలియన్ వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై సూపర్ బజ్ నెలకొని ఉంది. అలాగే ట్రైలర్ అదిరిపోయింది. 

57

దీనితో యుఎస్ లో సర్కారు వారి పాట రిలీజ్ కనీవినీ ఎరుగని విధంగా ఉండబోతోంది. మహేష్ కెరీర్ లోనే మునుపెన్నడూ లేని విధంగా యుఎస్ లో 603 లొకేషన్స్ లో సర్కారు వారి పాట ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. శ్లోక ఎంటర్టైన్మెంట్స్, ఫ్లై హై సినిమాస్ సంస్థలు సర్కారు వారి పాట చిత్రాన్ని భారీ ఎత్తున యుఎస్ లో రిలీజ్ చేయబోతున్నాయి. 

67

సర్కారు వారి పాట చిత్రంపై ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం యుఎస్ బాక్సాఫీస్ వద్ద సునామీ షూరూ కాబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నంబర్స్ ఇప్పుడే చెప్పలేం కానీ.. ఖచ్చితంగా ఊహకు అందని విధంగా రికార్డులు ఉండబోతున్నాయి అని అంటున్నారు. 

77

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సముద్ర ఖని విలన్ గా నటించగా.. నదియా, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్ కమెడియన్ గా మహేష్ పక్కనే కనిపిస్తున్నాడు. 

click me!

Recommended Stories