Vishwak Sen Controversy: టీవీ యాంకర్‌ని, హైదరాబాద్‌ మేయర్‌ని ఆడుకుంటున్న ట్రోలర్స్.. క్షమాపణలకు డిమాండ్‌

Published : May 04, 2022, 01:51 PM IST

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌పై ప్రముఖ టీవీ ఛానెల్‌ యాంకర్‌ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆమెకి మద్దతు ఇచ్చిన మేయర్‌ ని సైతం ఆడుకుంటున్నారు ట్రోలర్స్. దీంతో వివాదం మరింత ముదురుతోంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
17
Vishwak Sen Controversy: టీవీ యాంకర్‌ని, హైదరాబాద్‌ మేయర్‌ని ఆడుకుంటున్న ట్రోలర్స్.. క్షమాపణలకు డిమాండ్‌

హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen)తాను నటించిన `అశోకవనంలో అర్జునకళ్యాణం`(Ashokavanamlo Arjunakalyanam) సినిమా ప్రమోషన్‌ కోసం ఆ మధ్య చేసిన ఓ ప్రాంక్‌ వీడియో వివాదంగా మారిన విషయం తెలిసిందే. తన అభిమాని రోడ్డుపై పెట్రోల్‌ పోసుకుంటున్నట్టుగా ఓ వీడియోని వదిలారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు వెళ్లింది. అయితే ఈ విషయంలో ఆయన తాను చేసిన ఉద్దేశాన్ని వెల్లడించారు. తాను పెట్రోల్‌ వాడలేదని, జస్ట్ ఫన్‌ కోసం చేశామని క్లారిటీ ఇచ్చారు. 

27

అయితే ఈ వివాదంపై `టీవీ9` విశ్వక్‌ సేన్‌తో డిబేట్‌ ప్లాన్‌ చేసింది. స్టూడియోకి ఆయన్ని పిలిచారు. వారి కోరిక మేరకు వచ్చిన విశ్వక్‌సేన్‌పై యాంకర్‌ దేవి నాగవళ్లి(Devi Nagavalli) వివాదస్పద కామెంట్‌ చేశారు. `పాగల్‌ సేన్‌` అని, `డిప్రెషన్‌ పర్సన్‌` అని, `మ్యాడ్‌ సేన్‌` అంటూ కామెంట్‌ చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఈ విషయాన్ని విశ్వక్‌ సేన్‌ స్టూడియోలో లైవ్‌లోనే నిలదీశాడు. తనని అలా పిలవడం తప్పు అని చెబుతూ, మీపై కేసు వేయోచ్చు అంటూ హెచ్చరిస్తూనే మీలా నేను చేయను, నాకు కొన్ని ఉన్నాయి అంటూ వెల్లడించారు. దీంతో మండిపోయిన యాంకర్‌ దేవి నాగవల్లి ఆయనపై ఫైర్‌ అవుతూ, స్టూడియో నుంచి వెళ్లిపోమంటూ గట్టిగా అరిచింది. తీవ్ర స్థాయిలో అవమాన పరిచింది.

37

ఈ క్రమంలో విశ్వక్‌ సేన్‌ ఒక బూతు పదం వాడుతూ వెళ్లిపోయాడు. ఈ స్టూడియోకి రావాల్సిన అవసరం లేదని, మీరు పిలిస్తేనే వచ్చానని వెల్లడించారు. తాను యాంకర్‌ని బూతు పదం వాడి తిట్టినందుకు తర్వాత క్షమాపణలు చెప్పారు విశ్వక్‌ సేన్‌. కానీ తనకు మహిళలంటే గౌరవం ఉందని చెప్పారు. తాను అలా ఎప్పుడూ చేయనని తెలిపారు. నిన్న జరిగి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు విశ్వక్‌ సేన్‌. Vishwak Sen Devi Nagavalli Controversy, 

47

అయితే ఇప్పుడు యాంకర్‌ దేవి నాగవళ్లిపై విశ్వక్‌ సేన్‌ చేసిన కామెంట్లకి తప్పుపడుతూ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి రంగంలోకి దిగడం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసినట్టయ్యింది. ఆమె ఓ మహిళపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పడంలో తప్పులేదు. కానీ నెటిజన్లు, హైదరాబాద్‌ ప్రజలు మాత్రం ఆమెని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మీకు సంబంధం లేని విషయం మీకు ఎందుకని, ఫస్ట్ హైదరాబాద్‌ రోడ్లని పట్టించుకోవాలని కోరుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయని, ఫస్ట్ ఆ సమస్యని పరిష్కరించమని, ఆ తర్వాత బయట విషయాలు గురించి మాట్లాడొచ్చంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 

57

విశ్వక్‌సేన్‌పై టీవీ9 యాంకర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. విశ్వక్‌ సేన్‌ చేసిన `బూతు` వ్యాఖ్యలను తప్పుపడుతూనే యాంకర్‌ ప్రవర్తన సరికాదంటున్నారు. ఆమె ఓ గెస్ట్ ని పిలిచి ఇలా అవమానించడమేంటి? అని, ఇదెక్కడి జర్నలిజం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ వ్యక్తిని పట్టుకుని డిప్రెషన్‌ పర్సన్‌ అని ఎలా కామెంట్‌ చేస్తారని, అసలు ఓ వ్యక్తి అనారోగ్య సమస్యని ఇలా బహిరంగంగా విమర్శించే హక్కు ఎవరిచ్చారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీవీ9 స్టాండర్డ్స్ ఇవేనా, పెద్ద ఛానెల్‌ అయితే ఏదైనా చేస్తారా? యాంకర్‌ స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? అంటూ దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

67

మరోవైపు ప్రముఖ విమర్శకుడు బాబు గోగినేని(Babu Gogineni) దీనిపై ఘాటుగానే స్పందించారు. ఆయన యాంకర్‌ దేవినాగవల్లిపై, స్టూడియో నిర్వాహకాన్ని ఎండగట్టారు. హై స్టాండర్డ్స్ కలిగిన ఛానెల్‌ ఇలా దిగజారి ప్రవర్తించడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక నటుడి మానసిక స్థితిని మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ఇది ఆయన ఒక్కరిని కాదు, కొన్ని లక్షల మందిని అవమానించడమే అని, వారిని కించపరచడమే అని వెల్లడించారు. ప్రతి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఇలా డిప్రెషన్‌కి గురవుతున్నారని, వారందరిని దేవి నాగవళ్లి కించరపరడమే అవుతుందన్నారు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ రోడ్డుపై చేసిన ప్రాంక్‌ వీడియోకి ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలిగానీ, హెచ్‌ఆర్సీకి వెళ్లడమేంటి? అని ప్రశ్నించారు.
 

77

మరోవైపు ఈ విషయంలో దేవి నాగవళ్లి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. `డీజే టిల్లు` టైమ్‌లోనూ ఇదే యాంకర్‌ ఇలానే ప్రవర్తించారని, అప్పుడు కూడా తాను షాక్‌కి గురయ్యానని తెలిపారు. ఇదెక్కడి జర్నలిజం అంటూ ఆయన ప్రశ్నించారు. యాక్టర్‌తోపాటు లక్షలాది మంది వ్యూవర్స్ కి టీవీ 9 యాంకర్‌ క్షమాపణలు చెప్పాలని తెలిపారు బాబు గోగినేని. ఇంతటి అసహ్యకరమైన ప్రశ్నని ఏ నటుడు భరించాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తంగా ఈ వివాదం టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories