సీక్వెల్స్ వెంట పడుతున్న స్టార్ హీరోలు, సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫార్ముల

Published : May 04, 2022, 01:17 PM ISTUpdated : May 04, 2022, 01:20 PM IST

సీక్వెల్... ఈ ఒక్క  ఫార్ములా .. సక్సెస్ కి మినిమం గ్యారంటీ ఇస్తోంది.  ఆ ఒక్క సినిమా.. రిలీజ్ కు ముందే  రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఇలా సినిమా మీద హైప్స్ పెంచేసేదే సీక్వెల్ మూవీ. ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి సీక్వెల్ గా రెండోది రావడం సహజం కానీ.. ఇప్పుడు ట్రెండ్ ఇంకా అడ్వాన్స్ అయ్యింది... సెకండ్ మూవీతో ఆగకుండా ఇప్పుడు థర్డ్ మూవీ అంటున్నారు. అది కూడా కెజియఫ్ వల్ల.   

PREV
19
సీక్వెల్స్ వెంట పడుతున్న స్టార్ హీరోలు, సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫార్ముల

సీక్వెల్ సీజన్ ని స్పీడప్ చేసింది కెజిఎఫ్. కెజిఎఫ్ .. సౌత్ సినిమా రికార్డులు చెరిపేసి రికార్డ్ కలెక్షన్లతో కన్నడ సినిమా స్టామినా ని ప్రూవ్ చేసిన సినిమా. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కి సర్ ప్రైజ్ అయిన ఆడియన్స్ .. కెజిఎఫ్ 2సూపర్ సక్సెస్ ని చూసి షాక్ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ ని మించిన గ్రాండియర్ , స్టార్ కాస్ట్ , బడ్జెట్ తో తెరకెక్కిన కెజిఎఫ్ 2 సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అయితే  ఈ రికార్డుల్ని కంటిన్యూ చెయ్యబోతోంది కెజిఎఫ్ 3.కెజిఎఫ్ 2 మేకింగ్ తోనే ఆశ్చర్యపోయిన ఆడియన్స్ కి ..లాస్ట్ లో కెజిఎఫ్ 3 అంటూ సర్ ప్రైజింగ్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. 

29

తెలుగు సినిమా చరిత్రను మార్చిన బాహుబలి , ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన బాహుబలి .. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 2 వేల కలెక్షన్లకు పైగా సాధించింది. బాహుబలి రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. 5 ఏళ్లుగా ఈ సినిమా సీక్వెల్ మీద లేని చర్చ .. లేటెస్ట్ గాతెరమీదకొచ్చింది. రాజమౌళి బాహుబలి పార్ట్ 3 ప్లాన్ చేస్తే ..చెయ్యడానికి రెడీ ప్రభాస్ . సో.. బాహుబలి 3 కూడా సెట్స్ మీదకొచ్చే అవకాశం ఉన్నట్టే .

39

సీక్వెల్ ప్లాన్ లో ఉంది బ్లాక్ బస్టర్ మూవీ ట్రిపుల్ఆర్ .  రాజమౌళి  డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ డైరెక్షన్లో  గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమా  అంత కంటే గ్రాండ్ గా రిలీజ్ అయింది. అనుకున్నట్టుగానే ట్రిపుల్ఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ట్రిపుల్ఆర్ సీక్వెల్ కి ఛాన్సుందని, ఆ యాంగిల్ లో స్టోరీ రెడీ చేస్తున్నాం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు  రైటర్ విజయేంద్రప్రసాద్. అటు ఎన్టీఆర్, రమ్ చరణ్ కూడా  సీక్వెల్ ఉంటే సై అంటున్నారు. 
 

49

సక్సెస్ ఫుల్ సీక్వెల్ గా రాబోతున్న మరో సినిమా పుష్ప 2. సుకుమార్ ,  అల్లు అర్జున్ కాంబినేషన్లో నెవర్ బిఫోర్ యాక్షన్ , మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కి  బాలీవుడ్ లో 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప ..కి సీక్వెల్ గా వస్తోంది పుష్ప 2. పుష్ప ద రైజ్ పేరుతో వచ్చిన ఫస్ట్ పార్ట్ కి ..పుష్ప ద రూల్ గా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని మించిన యాక్షన్ , ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్.

59

సీక్వెల్ ఫార్ములా తో మరో సక్సెస్ కొడదామనుకంటున్న మూవీ ఎఫ్ 3. సీనియర్ హీరో వెంకటేష్ అయితే వరుస పెట్టి సీక్వెల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ , వరుణ్ హీరోలుగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్ 2 కి సీక్వెల్ తెరకెక్కుతోంది. సేమ్ స్టార్ కాస్ట్ తో ఫస్ట్ పార్ట్ ని మించిన ఎంటర్ టైన్ మెంట్ తో ఎఫ్ 3 ప్లాన్ చేశారు అనిల్ రావిపూడి.
 

69

నాని  ప్రొడ్యూసర్ గా విష్వక్ సేన్ హీరోగా శైలేష్ డైరెక్షన్లో వచ్చిన మర్డర్ మిస్టరీ ఎంటర్ టైనర్ హిట్ . ఈ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా  ఆడియన్స్ కి బాగా నచ్చింది.   2021 లో హిట్ సీక్వెల్ చేస్తామని ముందే చెప్పిన నాని..అన్నట్టు గానే హిట్ సీక్వెల్ స్టార్ట్ చేశారు. కానీ జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఈ సారి విష్వక్ సేన్ తో కాకుండా  ఇంట్రస్టింగ్ హీరో అడవి శేష్ తో హిట్  సీక్వెల్  హిట్ 2  చేస్తున్నారు.
 

79

ఎనర్జిటిక్ హీరోనిఖిల్ , చందుమొండేటి కాంబినేషన్లో వచ్చిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ కార్తికేయ. 2014 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ స్టార్ట్ చేశారు టీమ్ . ఫస్ట్ పార్ట్ కి మించి ఎంగేజింగ్ గా ఉండబోయే ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ పర్ ఫామర్  అనుపమ్ ఖేర్ కూడా యాడ్ అయ్యారు.
 

89

 సూపర్ హిట్ అయిన సినిమా జాతిరత్నాలకి కూడా సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు టీమ్ . నవీన్, రాహుల్, దర్శి , ఫారియా లీడ్ రోల్స్ లో అనుదీప్ డైరెక్షన్లో ..నాగాశ్విన్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా ఫస్ట్ వీక్ కలెక్షన్లలో పెద్ద సినిమాలను దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతపెద్ద హిట్ అయ్యినందుకే ఈక్రేజీ కాంబినేషన్లోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు టీమ్.
 

99

నవీన్ పోలిశెట్టి  హీరోగా వచ్చిన డిటెక్టివ్ బేస్డ్  మూవీ ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ.  ఇప్పటికే  బాండ్ మూవీస్ వచ్చి చాలా కాలం అవ్వడంతో పాటు  కంప్లీట్ కామెడీతో ఎంటర్ టైనింగ్ గా వచ్చిన ఏజెంట్ అందరినీ ఆకట్టుకున్నాడు . మ్యాగ్జిమమ్ అందరూ కొత్తవాళ్లతోనేచేసిన ఈసినిమా  ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ గా సక్సెస్ అయ్యింది.  ఆ సినిమాకి  కూడా సీక్వెల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు హీరో నవీన్ పోలిశెట్టి.

click me!

Recommended Stories