Intinti Gruhalakshmi: నందుకి బుద్ధి చెప్పిన సరస్వతి.. తులసికి దూరంగా ఉండాలి అనుకుంటున్న సామ్రాట్?

Published : Jan 10, 2023, 11:28 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 10వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
18
Intinti Gruhalakshmi: నందుకి బుద్ధి చెప్పిన సరస్వతి.. తులసికి దూరంగా ఉండాలి అనుకుంటున్న సామ్రాట్?

ఈరోజు ఎపిసోడ్లో సరస్వతి నందు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు లాస్య మాజీ అల్లున్ని పట్టుకొని మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నారా ఇదే సంస్కారం మీ కూతురు కూడా వచ్చింది అనడంతో నువ్వు నోరు ముయ్యి అని అంటుంది సరస్వతి. పాతిక సంవత్సరాలుగా అల్లుడుగారు అని పిలిచాను ఇప్పుడు ఆ అర్హత కోల్పోయావు దిగజారిపోయావు అనడంతో అత్తయ్య అని అంటాడు నందు. ఇంతకంటే దిగజారిపోయి మాట్లాడడం నాకు చేతకాదు కాబట్టే లేదంటే  నేను మాట్లాడే మాటలకు నువ్వు చెవులు మూసుకోవాల్సి వచ్చేది అనడంతో నందు మౌనంగా ఉంటాడు. నా కొడుకుని ఎందుకు కొట్టావు అనడంతో నా భార్య గురించి తప్పుగా మాట్లాడాడు అని అంటాడు నందు.
 

28

 మరి అది నా కూతుర్ని తప్పుగా మాట్లాడింది అప్పుడు హరికథ విన్నట్టు మౌనంగా నిలబడ్డావె మరి దాన్ని చెంప పగలగొట్టలేదు అనడంతో నందు తలదించుకుంటాడు. ఒరేయ్ దీపక్ ఇప్పుడు దాని చెంప పగలగొట్టు ఎవరు అడ్డుస్తారు నేను చూస్తాను అనడంతో లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది.  అప్పుడు దీపక్ ఆగిపోవడంతో వాడు ఎందుకు ఆగిపోయాడో తెలుసా ఇప్పటికీ వాళ్ళ అక్క మాజీ భర్తగా నీకు గౌరవం ఇస్తున్నాడు అని అంటుంది సరస్వతి. ఇప్పుడు సరస్వతి నందుని నిలదీస్తూ తనుసరే పాతికేళ్ళు తులసి తో కాపురం చేశావు తులసి వ్యక్తిత్వం ఎలాంటిదో నీకు తెలియదా అని అంటుంది.
 

38

నీ పెళ్ళామా చెప్పుడు మాటలు విన్నావు వెళ్లి ఏ గంగలో అయినా మునుగు అనడంతో అత్తయ్య అని గట్టిగా అరవగా వద్దు అలా పిలవకు నాకు అసహ్యంగా ఉంది అని అంటుంది సరస్వతి. తులసి కళ్ళు తెరిచేలోపు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి వెంటనే ఇక నుంచి వెళ్లిపోండి అనడంతో తులసి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు సరస్వతి బాధపడుతూ ఉండగా అనసూయ ఓదారుస్తూ ఉంటుంది. ఇప్పుడు పరంధామయ్య ఒక తండ్రిగా కొడుకుని నేను అనాల్సిన మాటలు నువ్వు అన్నావు బంధం ఎక్కడ విడిపోతుందో అని నేను నా నోరుని నొక్కేసుకున్నాను అని అంటాడు పరంధామయ్య. వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను వదినా అని అనసూయ కాళ్లు పట్టుకోవడానికి వెళుతుండగా వద్దు అని అంటుంది సరస్వతి.

48

అప్పుడు అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు సరస్వతి సామ్రాట్ గురించి ఆలోచిస్తూ ఎందుకు దేవుడి వీళ్ళిద్దరినీ కలిపాడు. తులసిని దగ్గరుండి చూసుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సరస్వతి ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నారు ఆంటీ తులసి గారికి బాగానే ఉంది అనడంతో మరి నువ్వు ఎందుకు రాత్రంతా మెలకువగా ఉండి ఎదురు చూశావు అని అంటుంది సరస్వతి. నేను తల్లిగా జన్మనిస్తే నువ్వు స్నేహితుడిగా పునర్జన్మనిచ్చావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటుంది. నిన్న గొడవ జరిగింది నీకు ఎవరైనా చెప్పారా అని అడగగా దూరం నుంచి చూసాను ఆంటీ ఇక్కడికి రావడానికి భయం కాదు ఆ లాస్య మాటలకు అసహ్యం వేస్తోంది అని అంటాడు.
 

58

మా స్నేహం కారణంగా తులసి గారికి ఇబ్బందులు రాకూడదు అందుకే నేను ఏం మాట్లాడలేదు అని అంటాడు. అప్పుడు తులసికి మెలుకువ రావడంతో అందరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇప్పుడు తులసి కళ్ళు తెరిచి చూడగా సామ్రాట్ లేకపోవడంతో ఆయన కనిపించడం లేదు ఏంటి అనుకుంటూ ఉండగా బయటే ఉన్న సామ్రాట్ ఇకపై మన మధ్య ఇలాంటి దూరం ఉండడమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసిని కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడిస్తూ ఉంటారు. అప్పుడు శృతి అంకిత వాళ్ళందరూ జరిగిన విషయాన్ని చెప్పి క్షమాపణ అడగాలని ఉంది అని అంటారు. అప్పుడు వాళ్ళందరూ లోపల సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ బయటే ఉండి ఎమోషనల్ గా చూస్తూ ఉంటాడు.
 

68

మరొకవైపు నందు కోపంతో రగిలిపోతూ ఉండగా లాస్య కాఫీ తీసుకుని వస్తుంది. నా చుట్టూ అంత మంది నా వాళ్ళు ఉన్న ఏ ఒక్కరు నాకు సపోర్ట్ గా నిలబడలేదు అందరూ తమాషా చూస్తూ నిలబడ్డారు అనడంతో మనం ఒక పని చేద్దాం నందు అని అంటుంది లాస్య. నా పేరు తులసి నీ పేరు సామ్రాట్ గా మార్చుకున్నాం అప్పుడు అందరు మనకు సపోర్ట్ గా మాట్లాడుతారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు సామ్రాట్ ని గొప్పగా మాట్లాడుతూ నందుని కావాలనే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది లాస్య. అప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుతూ నా ఫ్రెండ్ కి అమౌంట్ టైట్ గా ఉందంట హ్యాండ్ ఇచ్చింది అనడంతో నందు షాక్ అవుతాడు. ఇప్పుడు నువ్వు ఓకే అంటే ఏంటి నువ్వు తాకట్టు పెడదాము అని అంటుంది లాస్య.
 

78

ఎందుకు కంగారు పడుతున్నావు నందు సంవత్సరంలోపు ఇండ్లు విడిపించేసి మన అప్పు తీర్చుకోవచ్చు అని అంటుంది లాస్య. అప్పుడు నందు లాస్య మాటలు విని ఇండ్లు తాకట్టు పెట్టడానికి సరే అని అంటాడు. మరొకవైపు అందరూ తులసి ఇంట్లో తులసిని చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో శృతి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు తులసి ఎందుకు మీరందరూ నా చుట్టే ఉన్నారు మీరు కూడా ఆఫీసు వదిలేసి ఇక్కడే ఉన్నారా సామ్రాట్ గారు అని అంటుంది. అప్పుడు తులసి ఇదేం నాకు నచ్చడం లేదు అందరూ పనులు మానుకొని నా చుట్టూ ఎందుకు ఉన్నారు అని అంటుంది. నాకు బాగో లేనప్పుడు నువ్వు చూసుకున్నావు కదా తులసి అనడంతో సరే అలా అయితే మీరందరూ ఇక్కడే ఉండండి నేను ఆఫీస్ కి వెళ్తాను అని అంటుంది.
 

88

 అదేంటి అని అనసూయ అనడంతో మరి మీరందరూ ఎందుకు పనులు మానుకొని ఇక్కడే ఉంటున్నారు మీరు భోజనం చేసి ఎవరి పనులు కొద్ది వారు వెళ్ళండి లేదంటే నేను ఆఫీస్ కి వెళ్తాను అనడంతో సరే అని అంటారు. అప్పుడు సామ్రాట్ నేను తులసి గారికి దీపక్ కి క్షమాపణలు చెప్పాలి తులసి గారి హస్బెండ్ గా సైన్ చేయడం వల్ల ఇంత గొడవ జరిగింది అని అంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ కి నచ్చ చెబుతుంది. అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు..

click me!

Recommended Stories