రెడ్‌ లెహంగాలో పెళ్లికూతురుగా కియారా.. సిద్ధార్థ్‌ని మ్యారేజ్‌కైనా పిలుస్తావా?.. టీజ్‌ చేస్తున్న ఫ్యాన్స్

Published : Jan 10, 2023, 10:31 AM IST

కియారా అద్వానీ బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. కానీ ఆమె అప్పుడే పెళ్లికి రెడీ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ని పెళ్లికైనా పిలుస్తావా అంటున్నారు.   

PREV
16
రెడ్‌ లెహంగాలో పెళ్లికూతురుగా కియారా.. సిద్ధార్థ్‌ని మ్యారేజ్‌కైనా పిలుస్తావా?.. టీజ్‌ చేస్తున్న ఫ్యాన్స్

కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా గత రెండుమూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆల్మోస్ట్ బహిరంగంగానే ఈ ఇద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. కలిసే తిరుగుతున్నారు. వెకేషన్‌కి కూడా కలిసే వెళ్తున్నారు. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో ఊపందుకున్నాయి. కానీ ఉన్నట్టుండి కియారా అద్వానీ పెళ్లి కూతురుగా ముస్తాబై కనిపించడం షాకిస్తుంది. 

26

ఇందులో రెడ్‌ లెహంగాలో మెరిసిపోతుంది కియారా. మరోవ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. అంతేకాదు భారీగా గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకున్నారు. కలిసి కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోని కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. అయితే ఇది `మోహె` అనే గ్రాండియన్‌ డిజైనర్‌ వేర్‌, దుస్తుల సంస్థ ప్రమోషనల్‌ వీడియో కావడం గమనార్హం. ఇందులో అచ్చం పెళ్లి కూతురులా కుందనపు బొమ్మలా ఉంది కియారా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

36

అయితే దీనిపై నెటిజన్లు, సిద్ధార్థ్‌, కియారా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో టీజ్ చేస్తున్నారు. సిద్ధార్థ్‌తో పెళ్ళి అనుకున్నామ్‌, వరుడు మారిపోయాడే అని, ఏంటి సిద్ధార్థ్‌ని పెళ్లికైనా పిలుస్తావా? లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చేస్తే చేశావ్‌ గానీ, సిద్ధార్థ్‌ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌ అని నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

46

సిద్ధార్థ్‌, కియారా కలిసి `షేర్షా` చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారు. పార్టీలకు, ఈవెంట్లకి ఈ ఇద్దరు జోడీగా కనిపిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ జంట ప్రేమలో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై వీరిద్దరు ఖండించకపోవడం విశేషం. 

56

అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట. మ్యారేజ్‌కి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ హోటల్లో గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారట. అత్యంతవైభవంగా మ్యారేజ్‌ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

66

ఇక ప్రస్తుతం సిద్ధార్థ్‌ `మిషన్‌ మజ్ను` చిత్రంలో నటించారు. ఇది ఓటీటీలో ఈనెల 20న విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్నా కథానాయిక. మరోవైపు కియారా అద్వానీ కొంత గ్యాప్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆమె రామ్‌చరణ్‌తో `ఆర్‌సీ15`లో నటిస్తుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఇతర ప్రాజెక్ట్ ల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories