ఒకప్పుడు గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan). ఇప్పటికీ చెక్కు చెదరని అందాలతో కట్టిపడేస్తోంది. కొన్నాళ్లు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. తాజాగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది.
సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు, తమిళం, మలయాళంలో వరుసపెట్టి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు బుల్లితెరపైనా సందడి చేస్తూ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది.
26
ఆయా టీవీ షోలతో టెలివిజన్ ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతూ వస్తోంది. తమిళం, మలయాళం, తెలుగులో ప్రసారం అవుతున్న డాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగు షోలలో తెగ సందడి చేస్తోంది.
36
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం అవుతున్న Dance Ikonషోకు జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈషోతో ఓటీటీలో అడుగుపెట్టి తెలుగు ఆడియెన్స్ ను మరింతగా ఖుషీ చేస్తోంది.
46
షోలో రమ్యకృష్ణ హుందాగా మెదులుతూనే.. గ్లామర్ విందుతోనూ మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఈషోల కోసం కుర్ర భామలకే షాకిచ్చేలా ఫొటోషూట్లు కూడా చేస్తోంది. తాజా ఫొటోషూట్ వైరల్ గా మారింది.
56
మోరూన్ ప్రింటెడ్ శారీలో రమ్యకృష్ణ మెరిసిపోతోంది. ఐదు పదుల వయస్సులోనే చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది. కసి చూపులతో ఇప్పటికీ హీటు పెంచుతోంది.
66
సీనియర్ హీరోయిన్ ఫొటోషూట్లకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈకాలం అందాల తారలకు కూడా పోటీనిచ్చే ఆమె బ్యూటీని పొగుడుతూ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. రమ్యకృష్ణ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుండటంతో ఖుషీ అవుతున్నారు. చివరిగా తెెలుగులో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా ‘లైగర్’లో నటించింది.