Prema Entha Madhuram: కొడుకుని ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన శారదమ్మ.. మరదలికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య!

Published : Apr 03, 2023, 03:25 PM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదిస్తుంది. స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలంటూ అత్తింట్లో నరకం సృష్టిస్తున్న ఒక  ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Prema Entha Madhuram: కొడుకుని ఇంటికి రావద్దంటూ షాకిచ్చిన శారదమ్మ.. మరదలికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్య!

 ఎపిసోడ్ ప్రారంభంలో మేము సీరియస్ గా ఏమి గొడవ పడలేదు ఏదో క్యాజువల్గా డైవర్స్ అనుకున్నాము అంతే అంటుంది మాన్సీ. డైవర్స్ క్యాజువల్ కాదు, స్వేచ్ఛ, స్వతంత్రం కావాలన్నావు నీ కోరిక మేరకే అన్ని నీకే అప్పజెప్పి కట్టుబట్టలతో బయటికి వెళ్ళాము అందుకు మీరు ఏం చేశారు? మీ గొడవలతో అమ్మని ఇక్కడ వరకు తీసుకువచ్చారు అంటూ కోప్పడతాడు ఆర్య.
 

29

 అంతా మాన్సీ వల్లే తనలో మార్పు వస్తుందని ఎదురు చూశాను కానీ ఇక ఈ టార్చర్ నావల్ల కాదు ఇప్పటికే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అనే గిల్టీనెస్  నన్ను ప్రశాంతంగా ఉంచటం లేదు దయచేసి ఇంటికి వచ్చేయండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటాడు నీరజ్. వద్దు తను అక్కడ అందరి అభిమానాలతో మహారాజు లాగా ఉన్నాడు ఇక్కడికి వస్తే కుట్రలు, కుతంత్రాలు తప్ప ఏమున్నాయి.
 

39

 ఈ నరకం నా బిడ్డకి వద్దు, ప్రశాంతంగా ఉంచడానికే దేవుడు ఈ ఇంటి నుంచి దూరం చేసాడేమో  అంటుంది శారదమ్మ. మీరైనా చెప్పండి వదినమ్మ అని నీరజ్ అంటే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మనదంతా ఒకటే కుటుంబం కొద్దిరోజులు అత్తమ్మ ని మాతోపాటు ఉండనివ్వండి అంటుంది అను. అంతేకానీ మీరు మాతో ఉండను అంటారు.
 

49

 ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఫ్రష్టేట్ అవుతాడు నీరజ్. కలిసి ఉంటే ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటే అసలు నేను బయటకి వెళ్లేవాడిని కాదు ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనకడుగు వేయకూడదు అంటాడు ఆర్య. నా భార్య ని బ్లెయిమ్ చేస్తే ఊరుకున్నాను నీ భర్త ఎదుగుదలకు నేనే అడ్డు అన్నావు తప్పకున్నాను  కానీ నీవల్ల నా తల్లి హాస్పిటల్ పాలయింది.
 

59

మళ్లీ ఇదే రిపీట్ అయితే ఆర్య వర్ధన్ అంటే ఏంటో చూస్తావు మైండ్ ఇట్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ఆర్య. మళ్లీ ఇలాంటివి జరగదు అంటూ బావగారికి, అత్తగారికి సారీ చెప్తుంది మాన్సీ. నా చేయి పట్టుకుని అక్కడే కూర్చో ప్రశాంతంగా నిద్రపోతాను అంటుంది శారదమ్మ. మరోవైపు ఉగాది రోజు పూజ చేసుకొని నీరజ్ దంపతులకు ఆశీర్వచనం ఇస్తుంది శారదమ్మ.
 

69

 పనివాళ్లతో క్యారియర్లు సిద్ధం చేయమని చెప్తుంది. ఎందుకు అని మాన్సీ అడిగితే మనం అందరం ఈరోజు దాదా వాళ్ళ ఇంటిదగ్గర భోజనం చేస్తున్నాము ఏం నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతాడు నీరజ్.వేరే దారి లేక నాకేమీ ప్రాబ్లం లేదు అంటుంది మాన్సీ. నీరజ్ ని కారు సిద్ధం చేయమనటంతో బయటికి వెళ్తాడు నీరజ్. పని వాళ్ళకి పండగ బోనస్ ఇచ్చారా అని అత్తగారిని అడుగుతుంది మాన్సీ.
 

79

 మర్చిపోయాను అంటూ పని వాళ్ళని తీసుకొని తన రూమ్ కి వెళ్తుంది శారదమ్మ. అదే అదునుగా వంటకాలు ఏమేం చేసారో చూసిన మాన్సీ సంవత్సరానికి సరిపడా వంటలన్నీ మోసుకుపోతున్నారు అక్కడ మీరు ఎలా తింటారో నేను చూస్తాను అంటూ వంటల్లో ఉప్పులు, కారాలు ఎక్కువ మోతాదులో కలిపేస్తుంది. మరోవైపు ఆర్య కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది అను.
 

89

అది చూసిన ఆర్య నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. చాలా బాగుంది ఎలా చేయించావు అని అడుగుతాడు. నేను కాదు అంజలి మేడం చేయించారు నాకు ఉగాదికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం అని. గిఫ్టు ఇచ్చినప్పుడే  మీ ఆయనకి కూడా బాగా నచ్చుతుంది అని చెప్పారు దాన్నే మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ప్లాన్ చేశాను అంటుంది అను. అంజలి మేడం నిన్ను బాగా చూసుకుంటారు కదా అని ఆర్య అనడంతో అవును తను చాలా మంచిది. ఎలాంటి అరమరికలు ఉండవు సొంత సిస్టర్ లాగా నన్ను చూసుకుంటుంది అంటుంది అను.
 

99

 ఇంతలోనే శారదమ్మ వాళ్ళు రావడంతో వాళ్లని రిసీవ్ చేసుకుని వాళ్ళు తెచ్చిన భోజనాలను చూసి సర్ప్రైజ్ అవుతారు ఆర్య వాళ్ళు. ఏంటి నీరజ్ ఇదంతా అని ఆర్య అడిగితే దాదా లేకుండా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు అందుకే ఈరోజు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంటూ మాన్సీని వడ్డించమంటాడు నీరజ్.వంటలు వాసన గుమగుమలాడుతుంది నీరజ్. తింటే నోరు, కడుపు రెండూ మండిపోతాయి అనుకుంటుంది మాన్సీ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

click me!

Recommended Stories