మాజీ ప్రియుడు కార్తిక్ ఆర్యన్ బర్త్ డే... స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా పోస్ట్ 

First Published | Nov 23, 2022, 1:38 PM IST


బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా మాజీ ప్రేయసి సారా అలీ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. 
 

Karthik Aryan

నవంబర్ 22 కార్తీక్ ఆర్యన్ బర్త్ డే. 1990లో పుట్టిన కార్తీక్ ఆర్యన్ నేడు 32వ ఏట అడుగు పెట్టాడు. బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ హీరోయిన్స్, ఫ్యాన్స్ ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. వాటిలో సారా అలీఖాన్ విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. సారా ఒకప్పటి కార్తీక్ ప్రేయసిగా ప్రచారం కాగా ఆమె శుభాకాంక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Karthik Aryan

హ్యాపీ బర్త్ డే కార్తీక్ ఆర్యన్. ఈ ఏడాది నీ ఆకాంక్షలు, కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను, అని కామెంట్ చేసిన సారా అలీ ఖాన్, బర్త్ డే స్టిక్కర్ జోడించి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. సారా అలీఖాన్ బర్త్ డే సందేశం వైరల్ గా మారింది. 
 


Karthik Aryan

కార్తీక్ ఆర్యన్-సారా అలీ ఖాన్ జంటగా ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో లవ్ అజ్ కల్ మూవీ చేశారు. ఈ మూవీ ప్లాప్ అయినా కార్తీక్-సారా కెమిస్ట్రీ మాత్రం హిట్ అయ్యింది. కొన్నాళ్ళు ఈ లవ్ బర్డ్స్ రిలేషన్ ఎంజాయ్ చేశారు. వారి సోషల్ మీడియా పోస్ట్స్, డేటింగ్స్, ఔటింగ్స్ దానికి సాక్ష్యంగా నిలిచాయి. 
 

Karthik Aryan

కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ ఈ విషయంపై స్పష్టత కూడా ఇచ్చారు. కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలని నువ్వు ఒకసారి కోరుకున్నావు. అది నిజం చేశావు, అని కరణ్ సారా అలీ ఖాన్ తో అన్నారు. ఎటువంటి మనస్పర్థలు లేకున్నా చిన్నగా ఈ జంట దూరమయ్యారు. రిలేషన్ బ్రేక్ అయినా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తాజా పరిణామం తెలియజేస్తుంది.

Karthik Aryan


హీరోగా కార్తీక్ ఆర్యన్ జోరు చూపిస్తున్నారు. ఆయన గత చిత్రం భూల్ బులియా 2 మంచి విజయం సాధించింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కి ఈ చిత్రం ఒకింత ఉపశమనం కలిగించింది. కార్తీక్ ఆర్యన్ నటించిన ఫెడ్డీ విడుదలకు సిద్ధంగా ఉంది. అల వైకుంఠపురంలో రీమేక్ షెహజాదా, సత్యప్రేమ్ కి కథ చిత్రాల్లో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నారు. 

Latest Videos

click me!