Sankranthi 2023: బాలయ్య-పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో...  ఊరించి ఊసూరుమనిపించారే, ఇంతకీ ఏముంది?

Published : Jan 15, 2023, 11:54 AM ISTUpdated : Jan 15, 2023, 12:14 PM IST

మెగా-నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ఆహా ఈ మెగా ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులతో పంచుకున్నారు.   

PREV
18
Sankranthi 2023: బాలయ్య-పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో...  ఊరించి ఊసూరుమనిపించారే, ఇంతకీ ఏముంది?
Unstoppable

బాలయ్య-పవన్(Unstoppable with NBK) విరుద్ధ స్వభావాలు కలిగిన వ్యక్తులు. ఒకరు నిప్పు ఒకరు ఉప్పు అని చెప్పొచ్చు. వీరి మధ్య మనస్పర్థలు కూడా ఉన్నాయి. చిరంజీవి ఫ్యామిలీ రాజకీయ వైఫల్యాల మీద బాలకృష్ణ చేసిన కామెంట్స్ గొడవలకు కారణమయ్యాయి. 2019లో నాగబాబు బాలయ్య టార్గెట్ గా ఓ సిరీస్ ఆఫ్ వీడియోలు చేశాడు. మీ బ్లడ్ ఏంటి మీ బ్రీడ్ ఏంటి...? అంటూ విమర్శల దాడి చేశారు. 

28
Unstoppable

ఇక ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాన్ వార్ ఉండనే ఉంది. బాలయ్య-చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదలైతే వాతావరణం హీటెక్కుతుంది.  ఫ్యాన్స్ తమ హీరో మూవీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. లేటెస్ట్ సంక్రాంతి వార్ వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాల విషయంలో కూడా అదే జరిగింది. దేశం కానీ దేశంలో పవన్-బాలయ్య ఫ్యాన్స్ కొట్టుకున్నారు. 

38
Unstoppable

ఈ నేపథ్యంలో బాలకృష్ణ(Balakrishna) టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం విశేషత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఆహా యాజమాన్యం పవన్ అతిథిగా వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవాలి అనుకుంటుంది. జనాల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేలా ప్రసారం డిలే చేస్తున్నారు. ప్రోమోలతో హైప్ పెంచేస్తున్నారు. 

48
Unstoppable


కాగా జనవరి 15న సంక్రాంతి(Sankranthi 2023) పండగను పురస్కరించుకొని అన్ స్టాపబుల్ బాలకృష్ణ,పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. జస్ట్ ప్రోమో అయినప్పటికీ హైప్ ఏర్పడింది. ఇరు హీరోల ఫ్యాన్స్ దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 
 

58
Unstoppable

అయితే ఎదురు చూసినంత మేటర్ ప్రోమోలో లేదు. కనీసం రెండు ముందు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయనుకుంటే... కేవలం బాలయ్య కామెంట్ తో ముగించారు. ముందు నేను ఈయన మెజర్మెంట్స్ తీసుకోవాలి... అని బాలకృష్ణ అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ పెద్దగా నవ్వేశారు.

68
Unstoppable

ప్రోమో ఇద్దరు స్టార్స్ కి సంబంధించిన ఎంట్రీ ఎలివేషన్స్ తో నింపేశారు. బాలయ్య-పవన్ ఎపిసోడ్ (Pawan Kalyan On AHA) కోసం పెద్ద ఎత్తున కట్ అవుట్స్ కట్టి డెకరేట్ చేశారు. అభిమానుల అభివాదాల మధ్య పవన్, బాలయ్య లగ్జరీ కారుల్లో వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రోమో నిడివి పెంచి... ఆసక్తిరేపే ప్రశ్నలతో ముగించి ఉంటే బాగుండు... అనే భావన కలిగింది.

78
Unstoppable


 త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. పవన్ జీవితంలో ఉన్న పెళ్లిళ్ల కాంట్రవర్సీని బాలయ్య అడిగే సూచనలు కలవు. ఇక రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలు, టీడీపీ అధినేత బాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నారనే అపవాదులు చర్చకు రానున్నాయని సమాచారం. బోల్డ్ షోగా పేరున్న అన్ స్టాపబుల్ లో బాలయ్య-పవన్ మధ్య ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటాయో చూడాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. 

88
Unstoppable

కాగా ప్రభాస్(Prabhas) ఎపిసోడ్ కి విపరీతమైన హైప్ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఆహా యాజమాన్యం విఫలం చెందారు. ఎపిసోడ్ విడుదల రోజు ఆడియన్స్ పెద్ద ఎత్తున లాగిన్ అయ్యారు. హెవీ ట్రాఫిక్ నేపథ్యంలో సర్వర్స్ పనిచేయలేదు. దీంతో భారీ మొత్తంలో వ్యూవర్షిప్ కోల్పోయారు. పవన్ ఎపిసోడ్ విషయంలో అన్ని విధాలుగా సిద్ధమై ఉంటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories