`ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్` చిత్రాలతో విజయాలు అందుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె కెరీర్ గాడి తప్పింది. తర్వాత సినిమాలన్నీ పరాజయం చెందాయి. `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24`కిసెస్`, `ఒరేయ్ బుజ్జిగా` సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. అందాల ఆరబోత కాదు, కంటెంట్ ముఖ్యం అని తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేస్తుంది.