ఇమ్మానియేల్ పై వర్ష విపరీతమైన ప్రేమ చూపిస్తారు. ఆయన తనకు దొరికిన అదృష్టం అంటారు. పలు బుల్లితెర షోలో ఇమ్మానియేల్ పై తనకున్న ఇష్టాన్ని వర్ష బయటపెట్టారు. ఆ మధ్య జబర్దస్త్ వేదికపై ఇమ్మానియేల్ వర్షకు తాళి కట్టాడు. అలాగే ఓ నగల దుకాణానికి తీసుకెళ్లి ఆమె కోరుకున్న జ్యూవెలరీ కొని ఇచ్చాడు. ఈ వీడియో ఇమ్మానియేల్ తన యూట్యూబ్ ఛానల్ చేయడం జరిగింది. రష్మీ, సుడిగాలి సుధీర్ మాదిరి వీరు కూడా బుల్లితెర క్రేజీ లవర్స్ అయ్యారు. అది వాళ్ళ కెరీర్ కి ప్లస్ అవుతుంది.