సంక్రాంతి మొనగాడు సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ టైమ్‌ బరిలోకి దిగిన సినిమా ఏంటో తెలుసా? ఎన్టీఆర్‌కే మతిపోయింది

First Published | Nov 17, 2024, 1:15 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణని ఒకప్పుడు సంక్రాంతి మొనగాడు అనేవారు. అయితే అలా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్‌పై ఎలా సక్సెస్‌ అయ్యాడనేది తెలుసుకుందాం. 
 

సూపర్‌ స్టార్‌ కృష్ణ టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న లెజెండ్‌. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన నిరూపించుకున్నారు. అనేక ప్రయోగాలు చేసి మెప్పించారు. సినిమాకి సంబంధించిన ప్రతి ప్రయోగం కృష్ణ సినిమాతోనే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో క్లాసిక్స్, మరెన్నో సూపర్‌ హిట్స్ తో ఇప్పటికీ అభిమానుల గుండెల్లో సూపర్‌ స్టార్‌గా నిలిచిపోయారు కృష్ణ.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సూపర్‌ స్టార్‌ కృష్ణకి మరో పేరు ఉంది. ఆయన్ని సంక్రాంతి మొనగాడు అని పిలిచే వారు. సంక్రాంతికి సూపర్‌ స్టార్ సినిమా వచ్చిందంటే హిట్‌ గ్యారంటీ. ఈ విషయాన్ని ఏకంగా ఆయనే వెల్లడించారు. సంక్రాంతికి తనకు తిరుగులేదని చెప్పారు. తన కెరీర్‌లో ముప్పై ఏళ్లపాటు సంక్రాంతికి తన సినిమాలు వచ్చేవట. వచ్చిన అన్ని సార్లు సక్సెస్‌ అయ్యాయని, దాదాపు 90శాతం సక్సెస్ రేట్‌ ఉందని తెలిపారు. 
 


ఈ క్రమంలో తాను సంక్రాంతి బరిలోకి దిగిన మొదటి సినిమా గురించి చెప్పారు. `అసాధ్యుడు` సినిమాతో ఆయన ఫస్ట్ టైమ్‌ పొంగల్‌ బరిలోకి దిగారట. వీ రామచంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఇందులో కృష్ణ హీరోగా నటించగా, వల్లూరి బాలకృష్ణ, చలం ప్రధాన పాత్రల్లో నటించారు. వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. 
 

అయితే ఈ మూవీ ఏకంగా ఎన్టీఆర్‌ సినిమాకి పోటీగా వచ్చింది. కేవీ రెడ్డి రూపొందించిన విజయ ప్రొడక్షన్‌ నుంచి వచ్చిన `ఉమాచండీ గౌరీ శంకరుల కథ` సినిమాని అదే సంక్రాంతికి విడుదల చేశారు. ఎన్టీఆర్‌ నటించిన ఈ మూవీపై సూపర్‌ స్టార్‌ నటించిన `అసాధ్యుడు` మూవీ విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఆ సమయంలో మైథలాజికల్‌ సినిమాలతో ఎన్టీఆర్‌ జోరు మీదున్నారు.

ఆయన విజయపరంపర సాగుతున్న సమయంలో అప్పుడప్పుడే హీరోగా నిలబడుతున్న కృష్ణ నటించిన `అసాధ్యుడు` పెద్ద హిట్‌ కావడంతో అంతా షాక్‌ అయ్యారు. రామారావుకే మతిపోయిందట. అప్పట్నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి తన సినిమాలు వచ్చాయని ముప్పై సార్లు సంక్రాంతికి తన సినిమాలు విడుదలయ్యాయని, ఆధిపత్యం చూపించాయని చెప్పారు కృష్ణ. 
 

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎన్టీఆర్‌తోనూ పలు మైథలాజికల్‌ మూవీ చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్‌కి పోటీగా సినిమాలు చేశారు. ఆయనకు పోటీగా చేసిన సినిమాలు చాలా విజయం సాధించాయట. ఓ రకంగా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండేదట. ఎన్టీఆర్‌ ప్రభుత్వంపై వ్యతిరేకంగానూ సినిమాలు చేసి కృష్ణ సక్సెస్‌ సాధించడం విశేషం.

ఇక 1961 నుంచి నటుడిగా మారిన కృష్ణ 2016 వరకు సినిమాలు చేశారు. దాదాపు ఐదున్నర దశాబ్దాలు ఆయన నటించి మెప్పించారు. రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వారసత్వాన్ని, లెగసీని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొనసాగిస్తున్నారు. 

Read more:80వేల కోట్లకు అధిపతి అయిన హీరో ఎవరో తెలుసా? రామారావు, అక్కినేని, చిరంజీవి వంటి హీరోలంతా ఆయన ముందు జుజూబి

also read: అల్లు అర్జున్‌ నెక్ట్స్ మూవీ స్టోరీ లీక్‌ ?, వామ్మో `బాహుబలి`ని మించి.. ఆ రేంజ్‌ అస్సలు ఊహించలేం

Latest Videos

click me!