22 ఏళ్ళ తర్వాత ప్రభాస్, చిరంజీవి మధ్య పోటీ.. సంక్రాంతి చిత్రాల లైనప్ ఇదే

Published : Aug 25, 2025, 07:28 AM IST

2026 సంక్రాంతికి సినిమాల పోటీ మొదలైంది. సంక్రాంతి రేసులో చిరంజీవి, ప్రభాస్ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
సంక్రాంతికి టాలీవుడ్ చిత్రాల లైనప్

ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుంది. ఎందుకంటే సినిమా రిలీజ్ లకు అది క్రేజీ సీజన్. మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల అడ్జెస్ట్మెంట్ లో కాస్త ఇబ్బందులు తప్పవు. ఈసారి కూడా 2026 సంక్రాంతికి క్రేజీ చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

DID YOU KNOW ?
బాలయ్య, చిరంజీవితో ప్రభాస్ పోటీ
22 ఏళ్ళ క్రితం 2004 సంక్రాంతికి చిరంజీవి అంజి, బాలయ్య లక్ష్మీనరసింహ చిత్రాలతో ప్రభాస్ పోటీ పడ్డారు. సంక్రాంతికి రిలీజ్ అయిన వర్షం మూవీ సంచలన విజయం సాధించింది.
25
మన శంకర వరప్రసాద్ గారు ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ అయింది. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ కూడా 'పండగకి వస్తున్నారు' అని పెట్టారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తారని అనిల్ రావిపూడి ప్రకటించారు. దీనితో ఇప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

35
22 ఏళ్ళ తర్వాత చిరంజీవితో ప్రభాస్ పోటీ ?

ఇక ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ లో రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పుడు రాజాసాబ్ డిసెంబర్ రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈ చిత్రం సంక్రాంతికి రావడం పక్కా అనే సమాచారం వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే 22 ఏళ్ళ తర్వాత చిరంజీవితో సంక్రాంతికి ప్రభాస్ పోటీ పడుతున్నట్లు అవుతుంది.

45
వర్షంతో ప్రభాస్ కి తొలి బ్లాక్ బస్టర్

2004 లో చిరంజీవి అంజి, ప్రభాస్ వర్షం చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. వర్షం చిత్రంతో ప్రభాస్ తన కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ కొట్టారు. అంజి చిత్రం మాత్రం గ్రాఫిక్స్ తో అబ్బురపరిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.

55
రేసులో తమిళ చిత్రం కూడా..

రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో పాటు యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా తన 'అనగనగా ఒక రాజు' చిత్రంతో సంక్రాంతికి వస్తున్నాడు. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాలతో పాటు తమిళ చిత్రం దళపతి విజయ్ నటించిన జన నాయకుడు సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. సో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే చిత్రాల లైనప్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories