బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చిత్ర విచిత్రంగా జరుగుతోంది. సెలబ్రిటీ, సామాన్యుల మధ్య స్నేహాలు, గొడవలు ఎమోషన్స్, నవ్వులు.. ఇలా ఉగాది పచ్చడిలా తయారయ్యింది బిగ్ బాస్ హౌస్. మరీ ముఖ్యంగా సామాన్యులను సెలబ్రిటీలను చేసిన బిగ్ బాస్, సెలబ్రిటీలకు ఫుడ్ లేకుండా చేశారు. రోజు, సాంబార్, ఆలు కర్రీ పంపిస్తూ.. అదే తినాలని రూల్ పెట్టడంతో, సాంబార్ తినలేక సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకు ఇచ్చిన ఫుడ్ తినడానికి రూల్ లేకపోవడంతో సంజన ఒక్క టీ కోసం అల్లాడిపోతోంది. రోజుకు 6 టీలు తాగుతాను నేను, ఒక్క టీ అయిన ఇవ్వండి అని సామాన్యులను సంజన బ్రతిమలాడుతోంది. కాని ఈ విషయంలో సామాన్యులు ఏమాత్రం కరగడంలేదు.