పెళ్లి పీఠలెక్కబోతున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌?.. హింట్‌ ఇస్తున్న `డెవిల్‌` బ్యూటీ.. లాజిక్‌ ఏంటంటే?

Published : Jan 02, 2024, 10:46 PM IST

కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌ సంయుక్త మీనన్‌.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ఆమె అందుకోసం ముందుగానే ప్రిపేర్‌ అవుతుందట. అందుకు సంబంధించిన లాజిక్‌ చెబుతున్నారు నెటిజన్లు.   

PREV
15
పెళ్లి పీఠలెక్కబోతున్న కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌?.. హింట్‌ ఇస్తున్న `డెవిల్‌` బ్యూటీ.. లాజిక్‌ ఏంటంటే?

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌.. తెలుగులో మంచి విజయాలు అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఆమె పట్టిదల్లా బంగారం అనేలా ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. `భీమ్లా నాయక్‌` ఫర్వాలేదనిపించింది. `బింబిసార` హిట్‌ అయ్యింది. `సార్‌` మూవీ పెద్ద హిట్‌. ఆ తర్వాత చేసిన `విరూపాక్ష` పెద్ద హిట్‌ అయ్యింది. 

25

 కళ్యాణ్‌ రామ్‌తో కలిసి మరో సినిమా చేస్తుంది. `బింబిసార`తోపాటు `డెవిల్‌`లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. సరిగ్గా తీస్తే ఇది కూడా హిట్‌ మూవీ అయ్యింది. దర్శకుడు, నిర్మాత మధ్య విభేదాలు సినిమా రిజల్ట్ తేడా కొట్టేలా చేసింది. ఇలా తెలుగులో సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది సంయుక్త మీనన్‌. 

35

కానీ ఇంతలోనే పెద్ద షాకిస్తుంది ఈ బ్యూటీ. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన రూమర్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఏడాది సంయుక్త మీనన్‌ పెళ్లి పీఠలెక్కబోతుందని అంటున్నారు. అయితే సంయుక్త మీనన్‌ అందుకు సంబంధించిన హింట్‌ కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన లాజిక్‌ బయటపెడుతున్నారు నెటిజన్లు. 
 

45

సంయుక్త మీనన్‌ ఇప్పటి వరకు నటించిన సినిమాలు గతంలో ఒప్పుకున్న మూవీస్. ఇటీవల కాలంలో ఆమె కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. కొత్తగా ఏ మూవీని ప్రకటించలేదు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ సంయుక్త మీనన్‌ సినిమాలు చేయడం లేదు.

55

మరి సినిమాలకు గ్యాప్‌ తీసుకుంటుందా? లేక సెలక్టీవ్‌గా వెళ్తుందా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఈ లాజిక్‌నే పట్టుకుని సంయుక్త మీనన్‌ పెళ్లి చేసుకోవాలనుకుంటుందని, అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదని, ఇప్పుడు ఆమె చేతిలో కొత్తగా మరేసినిమా లేదని అంటున్నారు. లాజికల్‌గా ఆమె యాక్టివిటీస్‌ని చూసి నెటిజన్లు ఈ కామెంట్‌ చేస్తుంది. మరి నిజం ఏంటనేది మాత్రం ఆమెకే తెలియాలి. ఆమె ఓపెన్‌ అవుతూనే వాస్తవం తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories