Tamannaah : తమన్నా లండన్ టూర్ ఫొటోలు.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే?

First Published Jan 2, 2024, 5:50 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా Tamannaah Bhatia  న్యూ ఇయర్ కు కొన్ని రేర్ ఫొటోలను పంచుకుంది. లండన్ టూర్ కు సంబంధించిన పిక్స్ ను తాజాగా షేర్ చేసింది. అభిమానులను ఫిదా చేసేలా ఫొటోలను పంచుకుంది. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తున్నారు. తన అభిమానులను విభిన్న పాత్రలు పోషించడం ద్వారా ఆకట్టుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అట్రాక్ట్ చేస్తున్నారు. 

తాజాగా మిల్కీ బ్యూటీ అభిమానులతో పాటు నెటిజన్లనూ ఫిదా చేసేలా ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం సెలబ్రెటీలంతా న్యూ ఇయర్ New Year 2024 సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమ ఫొటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ విషెస్ తెలుపుతున్నారు. 

Latest Videos


ఈ క్రమంలో తాజాగా తమన్నా భాటియా కూడా కొన్ని ఫొటోలను పంచుకుంది. తను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను యూనైటెడ్ కింగ్ డమ్ లండన్ లో జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమన్న పంచుకున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

ఎందుకంటే.. కొద్దిరోజులుగా తమన్నా స్టన్నింగ్ అండ్ లేటెస్ట్ అవుట్ ఫిట్ లోనే మెరుస్తున్నారు. మరోవైపు మైమరిపించేలా ఫొటోషూట్లు చేస్తూ అందాల దర్శనం చేశారు. కానీ తాజాగా మాత్రం నిండు దుస్తుల్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అలాగే తమన్నా మేకప్ లేకుండా దర్శనమివ్వడంతో మరింతగా ఖుషీ అవుతున్నారు. మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యానికి ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

మరోవైపు ‘2024లోకి వచ్చినా గతం గుండెలో నింపిన జోరు పోయేనా’ అంటూ క్యాషన్ ఇచ్చింది. తమన్నా పోయెటిక్ కామెంట్ తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తిరిగి ఆమెకు కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

తమన్నా ఫొటోలకు క్యూట్ గా ఇచ్చిన స్టిల్స్ కు మెస్మరైజ్ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక తమన్నా చివరిగా ‘బాంద్రా’ అనే మూవీలో నటించింది. ప్రస్తుతం ‘అరణ్మనై4’, ‘వేదా’లో నటిస్తోంది. 

click me!