తాను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది. పార్టీలో ఆల్కహాల్ తీసుకుంటానని, అయితే అన్ని పార్టీల్లో కాదని, కేవలం క్లోజ్ ఫ్రెండ్స్‌కి సంబంధించి జరిగే ఈవెంట్స్‌లో మాత్రమే అది కూడా కొద్ది మొత్తంలో మాత్రమే ఆల్కహాల్ సేవిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదే విధంగా ఎప్పుడైనా బాగా ఒత్తిడికి గురైన సమయంలో, ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఆల్కహాల్ తీసుకుంటానని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది. దీంతో సంయుక్త చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఉన్నది ఉన్నట్లు ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేందుకు ధైర్యం ఉండాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆడవాళ్లు తాగడం ఏంటి బాబూ అంటూ స్పందిస్తున్నారు.