హీరోయిన్ గా స్టార్ డమ్, పెళ్లి, విడాకులు, అనారోగ్యం, సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణం

Published : Mar 04, 2025, 11:25 AM IST

సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్లలో తన జీవితంలో సంతోషాలు, బాధలు, అనారోగ్యాలు, హిట్ సినిమాలు.. ఇలా తన 15  ఏళ్ళ కెరీర్ గురించి పోస్ట్ చేసింది బ్యూటీ. 

PREV
14
హీరోయిన్ గా స్టార్ డమ్, పెళ్లి, విడాకులు, అనారోగ్యం, సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణం

 సమంత సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. గత 2010లో విడుదలైన ఏ మాయ చేసావే సినిమా ద్వారా సమంత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ , మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది బ్యూటీ తమిళంలో కూడా వరుస సినిమాలు చేసింది. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి

24
సమంత సినీ ప్రయాణం: 15 ఏళ్లు పూర్తి

చివరిగా సమంత తెలుగులో ఖుషి సినిమాలో కనిపించింది. అటు తమిళంలో కాతువాక్కుల రెండు కాదల్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల తరువాత సమంత సినిమాలకు దాదాపు 2 ఏళ్తు గ్యాప్ ఇచ్చింది. 

తండ్రి మరణం, మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతూ ట్రీట్మెంట్  తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె  కోలుకుంటుంది. దాదాపు 2 ఏళ్ళ తరువాత ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ గడిపేస్తోంది. 

Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

34
సమంత, సమంత ఫిల్మోగ్రఫీ

ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది సమంత. ఈ సినిమా ద్వారా నిర్మాతగా కూడా పరిచయం కానుంది. ఈ సమయంలోనే సమంత సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి.

దీని కారణంగా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపింది. తన 15 ఏళ్ల సినీ జీవితాన్ని జరుపుకునే కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఆశీర్వదించబడినట్లుగా, కృతజ్ఞతతో, ప్రేమగా ఉన్నట్లుగా పేర్కొంది. 

Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

44

ఈ 15 ఏళ్ళ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు చూసింది సమంత, స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగింది. 7 ఏళ్ళు ప్రేమించిన హీరో నాగచైతన్యను పెళ్ళి చేసుకుంది. నాలుగేళ్ళు కాపురం తరువాత మన్పర్ధలతో విడాకులు తీసుకుంది.

ఆతరువాత డిప్రెషన్ మెయింటేన్ చేసిన ఈ హీరోయన్.. చాలా కాలం ఇబ్బందిపడింది. అంతే కాదు ఈలోపు సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు ఫేస్ చేసింది. ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని రిలాక్స్ అయ్యింది.

ఈలోపు మయోసైటిస్ వ్యాధి రావడంతో మరోసారి ఆమెకు కష్టాలు తప్పలేదు. అయినా ఎంతో ధైర్యంగా ఆ వ్యాధిని ఎదురించి, ట్రీల్ట్మెంట్ తీసకుంటూ.. పట్టుదలతో సాగిపోతోంది సమంత. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది స్టార్ బ్యూటీ. 

Also Read: ధనుష్, విజయ్, అజిత్ కి సాధ్యం కాలేదు, డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ మాత్రం రికార్డు సృష్టించాడు

Read more Photos on
click me!

Recommended Stories