`గేమ్ ఛేంజర్` నా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌, సముద్రఖని మనసులో మాట

First Published | Jan 12, 2025, 6:07 AM IST

సముద్రఖని ఇప్పుడు తమిళంలో కంటే తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన `గేమ్‌ ఛేంజర్‌`లో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ గురించి ఆయన ఓపెన్ అయ్యారు.

 దర్శకుడు, నటుడు సముద్రఖని నటుడిగా బిజీగా ఉన్నారు. అందులో భాగంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన `గేమ్ ఛేంజర్` సినిమాలో నటించారు.   రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్యా, జయరాం, సముద్రఖని వంటి నటీనటులు నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. పూర్తిగా రాజకీయ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టు టీమ్‌ ప్రకటించింది. వాస్తవం వేరేలా ఉంది. 

`గేమ్‌ ఛేంజర్‌` కథేంటనేది చూస్తే. ఐఏఎస్ అధికారి అయిన రామ్ చరణ్, అవినీతి మంత్రి ఎస్ జె సూర్యాపై పోరాడి చివరికి జైలుకు వెళ్తాడు. తన తండ్రిని చంపి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించబోతున్న సమయంలో ఎన్నికల అధికారిగా వస్తాడు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రకటిస్తారు. 


ఎస్ జె సూర్యా, రామ్ చరణ్, దర్శకుడు శంకర్

రామ్ చరణ్, ఎస్జె సూర్యా మధ్య జరిగే సంఘటనలే గేమ్ ఛేంజర్ కథ. మొదటి భాగంలో సముద్రఖని, అంజలి పాత్రలు పెద్దగా చూపించలేదు.  కానీ రెండో భాగంలో సముద్రఖని పాత్రే టర్నింగ్ పాయింట్. ఇంటర్వెల్‌కి ముందు ఆయన ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. 

ఎస్ జె సూర్యా సీఎం శ్రీకాంత్‌ని చంపే ముందు తదుపరి సీఎం ఎవరనే వీడియోను సముద్రఖని మీడియా ముందు బయటపెడతారు. ఆ తర్వాతే సినిమాలో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే `గేమ్ ఛేంజర్` సినిమాలో నటించడం గురించి సముద్రఖని మాట్లాడారు.

సముద్రఖని

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శంకర్ దర్శకత్వంలో నటించాలని చాలా ఆశపడ్డాను. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను. `ఇండియన్ 2,` `గేమ్ ఛేంజర్` సినిమాల్లో నటించాను. ఈ రెండు సినిమాల్లోనూ నా కోసమే కొన్ని సన్నివేశాలు రాశానని శంకర్ నాతో అన్నారు. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇంతకంటే నాకేం కావాలి? ఇదే నా లైఫ్ టైమ్‌ అఛీవ్‌మెంట్ అని తెలిపారు సముద్రఖని. ఆయన ఆ మధ్య `బ్రో` అనే సినిమాని పవన్‌తో రూపొందించిన విషయం తెలిసిందే. కానీ ఇది ఆడలేదు. 

read more: విజయ్‌ 69 `భగవంత్ కేసరి` రీమేక్, అనిల్ రావిపూడికి షాకిచ్చిన కమెడియన్, దళపతికి ఎందుకు నో చెప్పాడు?

also read: `డాకు మహారాజ్‌` మూవీ ట్విట్టర్ రివ్యూ, బాలయ్య తెరపై తాండవమే.. కానీ మైనస్‌ అదే

Latest Videos

click me!