విజయ్‌ 69 `భగవంత్ కేసరి` రీమేక్, అనిల్ రావిపూడికి షాకిచ్చిన కమెడియన్, దళపతికి ఎందుకు నో చెప్పాడు?

First Published | Jan 12, 2025, 5:44 AM IST

విజయ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి` మూవీకి రీమేక్‌ అట. తాజాగా కమెడియన్‌ వీటీవీ గణేష్‌ అధికారికంగా ప్రకటించి అనిల్‌ రావిపూడికి షాకిచ్చాడు. 
 

కోలీవుడ్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ప్రస్తుతం `విజయ్‌69`పేరుతో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని కేవీఎన్‌ సంస్థ నిర్మిస్తుంది. 
 

ఈ సినిమా `భగవంత్‌ కేసరి` మూవీకి రీమేక్‌ అనే రూమర్లు వినిపించాయి. కానీ ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే ప్రశ్న ఆ మధ్య అనిల్‌ రావిపూడికి ఎదురయ్యింది. కానీ ఆయన చర్చలు జరిగాయని, కానీ అదే వేరే మ్యాటర్‌ అంటూ దాటవేస్తూ వచ్చారు. తాజాగా ఆ విషయాన్ని తేల్చేశారు కమెడియన్‌ వీటీవీ గణేష్‌.

ఆయన అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో నటించారు. ఈ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌ శనివారం రాత్రి జరిగింది. ఇందులో వీటీవీ గణేష్‌ మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు. 


అనిల్‌ రావిపూడి ఎంత గొప్ప దర్శకుడో చెబుతూ, `భగవంత్‌ కేసరి` మూవీ రీమేక్‌ విషయాన్ని వెల్లడించారు. విజయ్‌69.. భగవంత్‌ కేసరి రీమేక్‌. ఈ మూవీని విజయ్‌ ఐదు సార్లు చూశారట. అంతగా ఇష్టపడ్డారని తెలిపారు. అదే సమయంలో మరో షాకింగ్‌ విషయం బయటపెట్టారు. రీమేక్‌ డైరెక్ట్ చేయాలని అనిల్‌ రావిపూడినే అడిగారు.

డైరెక్షన్‌ ఆఫర్‌ ఇచ్చారట. కానీ ఆయన నో చెప్పినట్టు వెల్లడించారు. రీమేక్‌ చేయనని విజయ్‌ ఆఫర్‌ని తిరస్కరించారని, విజయ్ తో సినిమా చేయడానికి డైరెక్టర్లంతా క్యూ కడుతున్నారని, కానీ అనిల్‌ రావిపూడి ఆ ఆఫర్‌కి నో చెప్పాడని చెప్పి షాకిచ్చారు. 
 

దీనికి అనిల్‌ రావిపూడి స్పందిస్తూ, విజయ్‌తో చర్చలు జరిగాయని, ఆయన చాలా మంచి వ్యక్తి అని, కలిసి ఒక్కసారే ఆయనేంటో, ఆయన గొప్పతనం ఏంటో అర్థమయ్యిందని తెలిపారు. అయితే తమ మధ్య కొన్ని చర్చలు జరిగాయని, అవన్నీ వేరే అని, సినిమా గురించి వాళ్లు అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు.

అయితే రీమేక్‌ అనే విషయాన్ని టీమ్‌ ప్రకటిస్తుందని, తాను చెప్పలేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు. వీటివీ గణేష్‌కి అడ్డుపడుతూ వచ్చారు. కానీఆ ప్రాజెక్ట్ విషయంలో ఏదో జరిగిందనే అనుమానాలను రేకెత్తించారు.

మరి విజయ్‌ లాంటి సూపర్‌ స్టార్‌తో సినిమా ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ అనిల్‌ రావిపూడి ఎందుకు వదులుకున్నాడనేది సస్పెన్స్. అయితే పారితోషికం మ్యాటర్‌ కావచ్చు అంటున్నారు. ఆ విషయంలోనే తేడా వచ్చిందని సమాచారం. అనిల్‌ రావిపూడి భారీగా డిమాండ్‌ చేయడంతో వాళ్లు నో చెప్పారట. దీంతో అనిల్‌ రావిపూడి తప్పుకున్నాడని అంటున్నారు.  అనంతరం హెచ్‌ వినోద్‌కి విజయ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించాడట.

ఇందులో బాలయ్య పాత్రలో విజయ్‌, కాజల్‌ పాత్రలో పూజ, శ్రీలీల పాత్రలు మమితా బైజు నటిస్తున్నట్టు తెలుస్తుంది. తమిళ నెటివిటీకి కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారు. విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీని స్థాపించారు. ఆయన హీరోగా నటిస్తున్న చివరి మూవీ ఇదే కావడం విశేషం. ఇంకా దీనికి టైటిల్‌ ఖరారు చేయలేదు. 
 

బాలకృష్ణ హీరోగా, కాజల్‌ హీరోయిన్‌గా నటించిన `భగవంత్ కేసరి` చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీలీల కూతురు తరహా పాత్రలో కనిపిస్తుంది. అర్జున్‌ రాంపాల్‌ నెగటివ్‌రోల్‌ చేశారు. శరత్ కుమార్‌ కీలక పాత్రలో నటించారు. శ్రీలీల పాత్ర ప్రధానంగా మూవీ సాగుతుంది. ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చి పెద్ద విజయం సాధించింది. 

అనిల్‌ రావిపూడి ప్రస్తుతం `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాన్ని రూపొందించారు. వెంకటేష్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా చేశారు. భీమ్స్ సంగీతం అందించారు. దిల్‌ రాజు నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో శనివారం మ్యూజికల్‌ ఈవెంట్ ని నిర్వహించారు. 

read more: `డాకు మహారాజ్‌` మూవీ ట్విట్టర్ రివ్యూ, బాలయ్య తెరపై తాండవమే.. కానీ మైనస్‌ అదే

also read: సంక్రాంతి సినిమాలకు పెద్ద దెబ్బ, హైకోర్ట్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Latest Videos

click me!