`డాకు మహారాజ్‌` మూవీ ట్విట్టర్ రివ్యూ, బాలయ్య తెరపై తాండవమే.. కానీ మైనస్‌ అదే

First Published | Jan 12, 2025, 4:10 AM IST

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ `డాకు మహారాజ్‌`. ఈ చిత్రం నేడు ఆదివారం(జనవరి 12న) విడుదలవుతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో ట్విట్టర్‌ రివ్యూలో తెలుసుకుందాం. 
 

బాలకృష్ణ ఇప్పటికే హ్యాట్రిక్‌ హిట్స్ తో ఫుల్‌ జోష్‌ లో ఉన్నారు. మంచి స్పీడుమీదున్నాడు. అదే స్పీడ్‌తో ఇప్పుడు మరో సినిమా `డాకు మహారాజ్‌`తో వచ్చాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్‌ విలన్‌గా చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

ఈ మూవీ ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలతో ఆకట్టుకుంది. `దబిడి దిబిడి` పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రం నేడు విడుదలవుతుంది. మరి ముందుగానే యూఎస్‌ ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమాని చూసిన వారంతా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్ లు పెట్టి మూవీ ఎలా ఉందో వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో `డాకు మహారాజ్‌` ట్విట్టర్ రివ్యూ చూద్దాం. 
 

`డాకు మహారాజ్‌` సినిమా పట్ల మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే చాలా వరకు హిట్ బొమ్మ అంటున్నారు. కానీ కొంత రొటీన్‌ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంత స్లోగా ఉంటుందని నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉంటుందట. సినిమా టెక్నీకల్ గా చాలా స్ట్రాంగ్‌గా ఉందని, కానీ కథ పరంగా కొత్తగా అనిపించదు అనే టాక్‌ వినిపిస్తుంది. క్లైమాక్స్ సినిమాకి మైనస్‌గా మారిందంటున్నారు. 
 


ఇంకా చెప్పాలంటే `డాకు మహారాజ్‌` బాలయ్య మార్క్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని సెకండాఫ్‌ ప్రారంభం ఎపిసోడ్ వరకు బాగానే ఉంటుందని, ఆ తర్వాత రొటీన్‌గా మారుతుంది, ఊహించేలా ఉంటుందని, స్లోగా సాగుతుందని తెలుస్తుంది. క్లైమాక్స్ కొత్తగా లేకపోవడంతో ఆ కిక్ మిస్‌ అవుతుందని యూఎస్‌ ప్రీమియర్స్ ద్వారా చూసిన ఆడియెన్స్ చెబుతున్నారు.

ఇక బాలయ్య ఫ్యాన్స్ ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్‌ సీన్లు ఉన్నాయట. థమన్‌ మరోసారి బాలయ్య కి కావాల్సిన విధంగా బీజీఎం అందించారట. మాస్‌ ఎలివేషన్లలో ఆయన బీజీఎం వేరే లెవల్‌ అని సమాచారం. 
 

దర్శకుడు మాస్‌ ఎలిమెంట్లని జోడించడంలో సక్సెస్‌ అయ్యాడని, ఫస్టాఫ్‌లో వాటికి కొదవ లేదని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్‌ కొంత డౌన్‌ అయినా, బోర్‌ తెప్పించదని తెలుస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా ఉంటుందట.

కొన్ని సీన్లు డౌన్‌ అయినా ఆ ఫీల్‌ తెప్పించదని చెబుతున్నారు. విజువల్స్ సినిమాకి మరో అసెట్‌ అంటున్నారు. ఫస్టాఫ్‌లో పెద్దగా కథ ఉండదని, సెకండాఫ్‌లోనే అసలు కథ స్టార్ట్ అవుతుందట. డాకు ఎపిసోడ్‌ వేరే లెవల్ అని మరికొందరు అంటున్నారు. 
 

`డాకు మహారాజ్‌` స్టోరీ పరంగా కొంత రెగ్యూలర్‌గానే ఉంటుందని, ఎమోషన్స్ బాగా ఉంటాయని, లేడీ క్యారెక్టర్లు హైలైట్‌గా ఉంటాయట. శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్రలో కూడా ట్విస్ట్ ఉంటుందని, ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య స్క్రీన్‌ ప్రజెన్స్, దర్శకుడు బాబీ డైరెక్టర్‌, బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్‌ వేరేలెవల్‌.

థమన్‌ బిజీఎం సినిమా మొత్తానికి హైలైట్ అని అంటున్నారు. ఎమోషనల్‌ ట్విస్ట్ లు, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ సినిమాకి ప్రాణం అని, క్లైమాక్స్ ఇంటెన్సిటీతో ఉంటుందని కొందరు చెబుతున్నారు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీలో వీటీవీ గణేష్‌ పాత్ర కామెడీ కొంత రిలీఫ్‌గా ఉంటుందట. 
 

సినిమాలో బాలయ్య హీరోయిజం పీక్‌లో ఉంటుందని ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ లా ఉంటుందట. పాత్ర కోసం ఆయన లుక్‌ లో మార్పులు కూడా బాగున్నాయట. ఓవరాల్‌గా మూవీ ఫస్ట్ ఆఫ్‌ యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లతో సాగిపోతుందని, ఫ్యామిలీ ఎపిసోడ్‌ కాస్త డల్‌గాఉంటుందని తెలుస్తుంది. సెకండాఫ్‌లో డాకు ఎపిసోడ్‌ హైలైట్‌ అని, ఆ తర్వాత క్లైమాక్స్ తగ్గిందని చెబుతున్నారు.

కథ కొత్తగా లేకపోవడం, ఊహించేలా ఉండటం మైనస్‌గా చెబుతున్నారు. క్లైమాక్స్ ని ఇంకా బాగా డీల్‌ చేయాల్సింది అని ట్విట్టర్‌ ద్వారా ఆడియెన్స్ చెబుతున్న మాట. కానీ ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం ఇదొక ఫీస్ట్ అనే అంటున్నారు. మరి నిజంగానే సినిమా ఎలా ఉందనేది `ఏషియానెట్`‌ రివ్యూలో తెలుసుకుందాం. 
 

Latest Videos

click me!